విఘ్నాలు తొలగి.. సుభిక్షంగా ఉండాలి.. టీవీ9 ఆఫీస్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలు..
దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్న వేళ టీవీ9 ప్రధాన కార్యాలయంలోనూ పండుగ సందడి నెలకొంది. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా పర్యావరణహితమైన మట్టి వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఛానల్ సీఎఫ్‌ఓ శివానందతో పాటు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. పూజ అనంతరం సిబ్బంది తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పూలు, విద్యుత్ దీపాలతో కార్యాలయం అందంగా ముస్తాబైంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
