పాలలో ఇవి కలిపి ఫేస్‌కు రాస్తే.. ముఖం మిళమిళా మెరవాల్సిందే!

 07 Oct 2026

Anand T

వయసు పెరిగే కొద్దీ చర్మం సాగడం, ముడతలు రావడం సహజం. కానీ చర్మాన్ని మళ్లీ మునపటిలా మార్చాలంటే ఖరీదైన క్రీముల కన్నా సహజ చిట్కాలే బాగా పనిచేస్తాయి.

అవును మన కిచెన్‌లో దొరికే మెంతులు, పచ్చి పాలతోనే చర్మాన్ని కాంతివంతంగా మార్చుకోవచ్చు.

ఇందుకోసం మీరు కొన్ని మెంతులను తీసుకుని, పచ్చి పాలలో సుమారు 3 గంటల పాటు నానబెట్టండి.

3 గంటల పాటు అలాగే ఉంచి నానిన మెంతులను పాలతో కలిపి మిక్సీలో మెత్తటి పేస్ట్‌లా రుబ్బుకోండి.

ఈ పేస్ట్‌ను ముఖానికి ఫేస్ ప్యాక్‌లా అస్లై చేసుకొని 30 నిమిషాల పాటు అలానే ఆరనివ్వండి. తర్వాత శుభ్రమైన నీటితో కడిగేయండి

మెంతుల్లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ గుణాలు మొటిమలు, బ్లాక్‌హెడ్స్, మచ్చలను త్వతగా తగ్గిస్తాయి.

పచ్చి పాలలో ఉండే లాక్టిక్ యాసిడ్, ప్రోటీన్లు చనిపోయిన కణాలను తొలగించి చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి.

అయితే ఫస్ట్ టైం వాడే వారు ముందు చేతిపై ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకొని మాత్రమే వాడండి.