AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణలో రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్.. 19,892 మెగావాట్లు

Telangana Power Demand: రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్ నమోదైనప్పటికీ.. వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడంలో కీలకపాత్ర పోషించిన విద్యుత్ సంస్థల సిబ్బందిని భట్టి విక్రమార్క అభినందించారు. తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (TGGENCO), ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ..

Telangana: తెలంగాణలో రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్.. 19,892 మెగావాట్లు
Telangana Power Demand
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Oct 07, 2026 | 5:25 PM

Share

Telangana Power Demand: తెలంగాణలో విద్యుత్ డిమాండ్ చరిత్రలోనే అత్యధిక స్థాయికి చేరుకుంది. రాష్ట్రంలో గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 19,892 మెగావాట్లకు చేరినట్లు ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. దాదాపు 20 వేల మెగావాట్లకు చేరువైన డిమాండ్ ఉన్నప్పటికీ.. రాష్ట్రంలో విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగించామని చెప్పారు. ప్రజా భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణలో విద్యుత్ డిమాండ్ పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే గణనీయంగా పెరిగిందన్నారు. కర్ణాటకలో గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 15 వేల మెగావాట్లలోపే ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 13 వేల మెగావాట్లుగా ఉందని తెలిపారు. ఈ రాష్ట్రాల కంటే తెలంగాణలో విద్యుత్ వినియోగ డిమాండ్ ఎక్కువగా ఉందని పేర్కొన్నారు.

రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్ నమోదైనప్పటికీ.. వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడంలో కీలకపాత్ర పోషించిన విద్యుత్ సంస్థల సిబ్బందిని భట్టి విక్రమార్క అభినందించారు. తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (TGGENCO), ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ (TRANSCO), విద్యుత్ పంపిణీ సంస్థలు (DISCOMs) అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో పనిచేయడం వల్లే ఈ స్థాయిలో డిమాండ్ ఉన్నప్పటికీ సరఫరాను కొనసాగించగలిగామని తెలిపారు.

ఇదే సమయంలో రాష్ట్ర విద్యుత్ రంగంపై కొందరు నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని భట్టి విక్రమార్క విమర్శించారు. DISCOMలు, TRANSCO, GENCOలను ప్రైవేటీకరించే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. అలాగే రాష్ట్ర విద్యుత్ సంస్థలను పబ్లిక్‌గా లిస్ట్ చేయడం లేదా వాటిని ప్రభుత్వ రంగం నుంచి తప్పించే ప్రతిపాదన కూడా లేదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను మరింత బలోపేతం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

నెహ్రూ అనుసరించిన ఆర్థిక విధానాలను ప్రస్తావించిన భట్టి.. మిశ్రమ ఆర్థిక వ్యవస్థతో పాటు బలమైన ప్రభుత్వ రంగ సంస్థలు కాంగ్రెస్ విధానంలో కీలక భాగమని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేస్తూనే రాష్ట్ర అభివృద్ధికి అనుగుణంగా విద్యుత్ రంగాన్ని మరింత పటిష్టం చేస్తామని తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us