AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సోషల్ మీడియా ఫేమ్ అగ్గిపెట్టి మచ్చ మృతి.. అనారోగ్యంతో కన్నుమూసిన కిరణ్ కుమార్

సోషల్ మీడియాలో పాపులర్ అయిన అగ్గిపెట్టిఅచ్చ అలియాస్ కిరణ్ కుమార్ మృతి. అనారోగ్యం కారణంగా స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. ఐదు రోజుల క్రితం అస్వస్థతకు గురైన అగ్గిపెట్టిమచ్చ తిరుపతి రూరల్ వైఎస్సార్ కాలనీలో కి తరలిస్తున్న కుటుంబ సభ్యులు

సోషల్ మీడియా ఫేమ్ అగ్గిపెట్టి మచ్చ మృతి.. అనారోగ్యంతో కన్నుమూసిన కిరణ్ కుమార్
Kiran
Rajeev Rayala
|

Updated on: Oct 07, 2026 | 5:21 PM

Share

ప్రముఖ కమెడియన్, యూట్యూబర్ ‘అగ్గిపెట్టి మచ్చ’ అలియాస్ కిరణ్ కుమార్ అనారోగ్యంతో మృతి చెందారు. గత నాలుగు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ తిరుపతిలోని సిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. యూట్యూబ్ వేదికగా తనదైన కామెడీ శైలితో ప్రేక్షకులను ఆకట్టుకున్న కిరణ్ కుమార్ ‘అగ్గిపెట్టి మచ్చ’ పేరుతో సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన చేసిన కామెడీ వీడియోలు, వినోదాత్మక కార్యక్రమాలకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది.

కిరణ్ కుమార్ మృతితో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానుల్లో విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల పలువురు యూట్యూబర్లు, కళాకారులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తీవ్ర అనారోగ్యంతో సోమవారం (అక్టోబర్ 05) తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో చేరిన కిరణ్ కు వెంటిలేటర్ పై చికిత్స అందించారు వైద్యులు. తిరుపతికి చెందిన కిరణ్.. ‘అగ్గిపెట్టె మచ్చ’గా సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యారు.

ఆయన చెప్పే డైలాగులు, ఆ ఎక్స్‌ప్రెషన్స్ చూసి జనాలు తెగ నవ్వుకునేవాళ్లు. దీంతో సినిమా సెలబ్రిటీలతో సమానంగా ఆయనకు కూడా భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘అగ్గిపెట్టె మచ్చ’ కిరణ్ వీడియోలు, మీమ్స్ లే కనిపించేవి. చివరకు యూట్యూబ్ ఛానెల్స్ సైతం ఆయన ఇంటర్వ్యూల కోసం క్యూ కట్టేవంటే అగ్గి పెట్టె మచ్చ క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్య ఆయన సోషల్ మీడియాలో ఎక్కడ కనిపించలేదు. ఇక ఇప్పుడు ఆయన మృతి వార్త తెలిసి ఆయన అభిమానులు, నెటిజన్స్ షాక్ అవుతున్నారు.

Follow Us