AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినిమా వచ్చి 24ఏళ్లు.. 12 ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకుంది.. ఇప్పటికీ అదే క్రేజ్..

కొన్ని సినిమాలు ప్రేక్షకుల మనసులో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంటాయి. మరికొన్ని సినిమాలు అవార్డులు అందుకుంటూ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంటాయి. అలాంటి సినిమాల్లో ఈ సినిమా ఒకటి. ఈ సినిమా విడుదలై 24ఏళ్లు అవుతుంది. ఇప్పటికీ ఈ సినిమా ఓ రికార్డ్ చెప్పాలి.

సినిమా వచ్చి 24ఏళ్లు.. 12 ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకుంది.. ఇప్పటికీ అదే క్రేజ్..
Movie
Rajeev Rayala
|

Updated on: Oct 07, 2026 | 6:00 PM

Share

సినిమా చరిత్రలో కొన్ని చిత్రాలు విడుదలైన సంవత్సరానికే కాకుండా.. ఎన్నేళ్లు గడిచినా ప్రేక్షకుల జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి. అలాంటి సినిమాల్లో బాలీవుడ్ క్లాసిక్ ‘దేవదాస్’ ఒకటి. 2002లో సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో ఓ సంచలనంగా నిలిచింది. షారుఖ్ ఖాన్, ఐశ్వర్యరాయ్, మాధురీ దీక్షిత్ వంటి స్టార్ నటీనటులు కలిసి నటించిన ఈ సినిమా ఇప్పటికీ ఓ రికార్డే.. శరత్ చంద్ర ఛటోపాధ్యాయ రాసిన ‘దేవదాస్’ కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ టైటిల్ రోల్‌లో కనిపించారు. తన చిన్ననాటి ప్రేయసి పార్వతిని దూరం చేసుకున్న తర్వాత జీవితంపై విరక్తి చెంది.. మద్యానికి బానిసైన దేవదాస్‌గా షారుఖ్ అద్భుతమైన నటనను కనబరిచారు. ఐశ్వర్యరాయ్ పార్వతి పాత్రలో, మాధురీ దీక్షిత్ చంద్రముఖిగా నటించి సినిమాకు మరింత ప్రత్యేకత తీసుకొచ్చారు. ముఖ్యంగా షారుఖ్ ఖాన్, ఐశ్వర్యరాయ్ మధ్య కెమిస్ట్రీ అప్పట్లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మరోవైపు మాధురీ దీక్షిత్ డాన్స్, నటన కూడా సినిమాకు హైలైట్ గా నిలిచాయి. భారీ సెట్స్, అద్భుతమైన కాస్ట్యూమ్స్, సంగీతం, పాటలు, బన్సాలీ దర్శకత్వ శైలి.. ఇవన్నీ కలిసి ‘దేవదాస్’ను ఓ విజువల్ ట్రీట్‌గా మార్చాయి.

‘దేవదాస్’కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం మాత్రం ఇప్పటికీ సోషల్ మీడియాలో చర్చకు వస్తూనే ఉంటుంది. సినిమాలో దేవదాస్ మద్యానికి బానిసైన వ్యక్తిగా కనిపిస్తాడు. ఈ పాత్రను మరింత సహజంగా చూపించేందుకు షారుఖ్ ఖాన్ షూటింగ్ సమయంలో నిజంగానే మద్యం సేవించేవారని అప్పట్లో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ విషయంపై సినిమాలో ధర్మదాస్ పాత్రలో నటించిన సీనియర్ నటుడు టికు తల్సానియా గతంలో మాట్లాడారు. షూటింగ్ సమయంలో కొన్ని సన్నివేశాలకు ముందు షారుఖ్ మద్యం సేవించేవారని ఆయన చెప్పినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. దేవదాస్ కేవలం ప్రేక్షకుల ఆదరణ మాత్రమే కాకుండా అవార్డుల పరంగానూ భారీ విజయాన్ని సాధించింది. పలు నివేదికల ప్రకారం ఈ చిత్రం మొత్తంగా 58 అవార్డులను అందుకుంది. ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లోనూ సినిమా సత్తా చాటింది.

షారుఖ్ ఖాన్ ఉత్తమ నటుడిగా, సంజయ్ లీలా బన్సాలీ ఉత్తమ దర్శకుడిగా అవార్డులు అందుకోగా.. ఐశ్వర్యరాయ్, మాధురీ దీక్షిత్ కూడా తమ నటనకు ప్రశంసలు, పురస్కారాలు అందుకున్నారు. IMDb వివరాల ప్రకారం ఈ చిత్రం 12 ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకుంది. అలాగే జాతీయ స్థాయిలోనూ పలు అవార్డులను సొంతం చేసుకుంది. విడుదల సమయంలో ‘దేవదాస్’ బాక్సాఫీస్ దగ్గర కూడా మంచి వసూళ్లు సాధించింది. ఈ సినిమా ఇండియాలో సుమారు రూ.57.86 కోట్ల వసూళ్లు సాధించగా.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.89.46 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సినిమా వచ్చి 24ఏళ్లు.. 12 ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకుంది
సినిమా వచ్చి 24ఏళ్లు.. 12 ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకుంది
జన్‌పథ్‌లో రణరంగం.. రాహుల్‌, ప్రియాంక సహా విపక్ష ఎంపీల అరెస్ట్‌
జన్‌పథ్‌లో రణరంగం.. రాహుల్‌, ప్రియాంక సహా విపక్ష ఎంపీల అరెస్ట్‌
10 ఏళ్ల క్రితం బంగారం, వెండి ధరలు ఎంత? తేడా తెలిస్తే షాకవుతారు!
10 ఏళ్ల క్రితం బంగారం, వెండి ధరలు ఎంత? తేడా తెలిస్తే షాకవుతారు!
జబర్దస్త్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన స్టార్ కమెడియన్
జబర్దస్త్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన స్టార్ కమెడియన్
సరదాగా మొదలైన అలవాటు మెడకు చుట్టేసుకుంది.. ఈ యువకుడి జీవితంలో..
సరదాగా మొదలైన అలవాటు మెడకు చుట్టేసుకుంది.. ఈ యువకుడి జీవితంలో..
మొబైల్ నెంబర్‌లో 3 ఉందా? ఇది ఎన్ని సార్లు వస్తే అదృష్టమో తెలుసా?
మొబైల్ నెంబర్‌లో 3 ఉందా? ఇది ఎన్ని సార్లు వస్తే అదృష్టమో తెలుసా?
నిండు గర్భిణీల ఆస్పత్రికి వచ్చిన మహిళ.. డాక్టర్లు షాక్! 4కిలోలతో
నిండు గర్భిణీల ఆస్పత్రికి వచ్చిన మహిళ.. డాక్టర్లు షాక్! 4కిలోలతో
తెలంగాణలో రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్.. 19,892 మెగావాట్లు
తెలంగాణలో రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్.. 19,892 మెగావాట్లు
ఇయర్‌బడ్స్‌లో విప్లవం.. ఇక ఫోన్ ముట్టుకోకుండానే పనులన్నీ పూర్తి!
ఇయర్‌బడ్స్‌లో విప్లవం.. ఇక ఫోన్ ముట్టుకోకుండానే పనులన్నీ పూర్తి!
సోషల్ మీడియా ఫేమ్ అగ్గిపెట్టి మచ్చ మృతి..
సోషల్ మీడియా ఫేమ్ అగ్గిపెట్టి మచ్చ మృతి..