- Telugu News Photo Gallery Travel tips first time going on foreign trip make these countries your tourist destination in telugu
Travel tips: మొదటిసారిగా విదేశానికి విహారయాత్రకు వెళ్లాలనుకుంటున్నారా.. ఈ ఐదు దేశాలు బెస్ట్ ఎంపిక..
First Time Trip Tips: మొదటిసారిగా విదేశీ పర్యటనకు వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే..ఉత్తమ పర్యాటక దేశాలను ఎంచుకుంటారు. ఎందుకంటే మీ మొదటి విదేశీ ప్రయాణం.. జీవితకాలం గుర్తుపెట్టుకునేదిగా ఉండాలని కోరుకుంటారు. ఈ నేపధ్యంలో మీరు చాలా ఆనందించే కొన్ని ముఖ్యమైన పర్యాటక దేశాల గురించి ఈరోజు తెలుసుకుందాం..
Updated on: Mar 07, 2022 | 3:20 PM

ఇంగ్లండ్: అందమైన పర్యాటక ప్రదేశాలకు నిలయం ఇంగ్లాండ్. అందమైన ప్రకృతిని చాలా ఇష్టపడతారు. మీరు మొదటిసారి విదేశీ పర్యటనకు వెళుతున్నట్లయితే.. మొదటి ఎంపికగా ఈ దేశాన్ని ఎంచుకోవచ్చు. యునైటెడ్ కింగ్డమ్ రాజధాని లండన్ తో మీ విదేశీ యాత్రను ప్రారంభించండి.

టర్కీ: ఆసక్తికరమైన చరిత్ర, రుచికరమైన ఆహారానికి ప్రసిద్ధి చెందిన టర్కీని సందర్శించడం ఒక విభిన్నమైన వినోదాన్ని ఇస్తుంది. టర్కీ రాజధాని అంకారాలో అనేక అద్భుతాలు ఉంటాయి. ముఖ్యంగా భోజన ప్రియులు నాన్ వెజ్ తినడానికి ఇష్టపడేవారైతే.. ఇక్కడ రుచికరమైన రకరకాల నాన్ వెజ్ ఫుడ్‌లు లభ్యమవుతాయి.

బార్సిలోనా: ఈ దేశం అందమైన దృశ్యాలు, భవనాలకు ప్రసిద్హి.. ఆకట్టుకునే వాస్తుశిల్పాలకు ప్రఖ్యాతి చెందింది. ఇది పర్యాటక అనుకూలమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా షాపింగ్ ప్రియులకు మంచి ఆనందాన్ని ఇస్తుంది. అందమైన బీచ్‌లు కూడా పర్యాటకులను ఆకర్షిస్తాయి.

జపాన్: టెక్నాలజీలో అగ్రగామి దేశం జపాన్‌లో కూడా అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి, ఇవి మొదటిసారిగా విదేశాలకు వెళ్లే ఆనందాన్ని రెట్టింపు చేస్తాయి. అయితే ఈ దేశాన్ని సందర్శించాలంటే ఒక్కసారి మీ బడ్జెట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. ఎందుకంటే జపాన్ లో కొంచెం ఖర్చు ఎక్కువని అంటున్నారు.

ఫ్రాన్స్: పర్యాటక రంగంలో ఫ్రాన్స్ కు పోటీ ఇచ్చే దేశం లేదని ఫ్యాషన్ ప్రియులు చెబుతున్నారు. పారిస్, లియోన్, స్ట్రాస్‌బర్గ్ వంటి చారిత్రక నగరాలు ఉన్నాయి. ఇక్కడ ఏడాది పొడవునా పర్యాటకులతో సందడి నెలకొంటుంది.మీరు మొదటిసారి విదేశానికి వెళ్లాలని అనుకుంటే... ఖచ్చితంగా ఫ్రాన్స్‌కు వెళ్లండి.




