AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీ కేర్‌ఫుల్.. ఈ కూరగాయలను పచ్చిగా తింటే యమడేంజర్.. పాము విషం కంటే ప్రమాదకరమట!

ఈ మధ్య కాలంలో చాలా మంది ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యం కోసం పండ్లు, కూరగాయలను తినడం స్టార్ట్ చేస్తున్నారు. అయితే వాటిలో కొన్ని కూరగాయలను కొందరు పచ్చిగా కూడా తింటారు. కానీ కొన్ని పండ్లు, కూరగాయలను సరైన రీతిలో తినకపోతే చాలా ప్రమాదకరం అని నిపుణులు అంటున్నారు. కొన్ని కూరగాయలు, పండ్లను పచ్చిగా తింటే అవి పాముల కంటే ప్రమాదకరమైనవి విషాన్ని ఉత్పత్తి చేస్తాయంటున్నారు. కాబట్టి పచ్చిగా వేటిని తినకూడదో తెలుసుకుందాం పదండి.

Anand T
|

Updated on: Nov 27, 2025 | 12:04 PM

Share
ఆరోగ్యండా ఉండేందుకు చాలా మంది తమ ఆహారంలో కూరగాలు, పండ్లను చేర్చుకుంటారు. కానీ ఇవే కొన్నిసార్లు వాళ్లకు అనారోగ్యాన్ని తెచ్చిపెడతాయి. వీటిలో కాసావా కూడా ఒకటి.. ఇందులో సైనైడ్ అనే విష పదార్థం ఉంటుంది. వీటిని పచ్చిగా తింటే లేదా సరిగ్గా ఉడికించకపోతే ఇది ప్రాణాంతకం కావచ్చు. చిన్న మొత్తంలో సైనైడ్ కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. కాబట్టి వీటిని తినేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి

1 / 5
 ఇవే కాకుండా ఆపిల్ గింజలు, చెర్రీస్, ఆప్రికాట్లు, బాదంపప్పులలో అమిగ్డాలిన్ అనే సమ్మేళనం ఉంటుంది, ఇది శరీరంలోకి సైనైడ్‌ను విడుదల చేస్తుంది. వీటిని తక్కువ మొత్తంలో తీసుకుంటే ప్రమాదకరం కాదు. కానీ వైద్యులు సిఫార్సు చేసిన మొత్తం కంటే ఎక్కువ తినడం చాలా ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి వీటిని తినే ముందు వైద్యులను సంప్రదించండి.

2 / 5
వీటితో పాటు మన రోజువారి ఆహారంలో ఉపయోగించే బంగాళాదుంపలను కూడా సరిగ్గా తినకపోతే ప్రమాదమని చెబుతున్నారు. కొన్ని సార్లు ఇవి ఆకపచ్చగా మారడాన్ని మీరు గమనించే ఉంటారు. లేదా అవి మొలకెత్తడం చూసి ఉంటారు. ఇందుకు కారణం వీటిపై సోలనిన్ అనే విషపూరిత సమ్మేళనం ఏర్పడడం. అలా మారిన వాటిని తినడం ప్రమాదకరమణి నిపుణులు అంటున్నారు. కాబట్టి వీలైనంత వరకు, మొలకెత్తిన, ఆకుపచ్చగా మారిన బంగాళదుంపలను తినడం అవైడ్ చేయడండి.

3 / 5
 అంతేకాకుంగా మన రోజూ తినే టమోటాలు, వంకాయలు వంటి కూరగాయల ఆకు భాగాలలో కూడా తేలికపాటి విషపదార్థాలు ఉంటాయి. ఈ కూరగాయలు తినడం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రమాదం ఉండదు. కానీ వాటిని పెద్ద మొత్తంలో పచ్చిగా తినడం వల్ల అనారోగ్యానికి కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు.

4 / 5
కాబట్టి. మీరు ఏదైనా పండు లేదా కూరగాయలను పచ్చిగా తినే ముందు, దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కూరగాయలు సరిగ్గా ఉడికించినట్లయితే ఎటువంటి ప్రమాదం లేదు. కాని వాటిని సరిగ్గా ఉడికించకుండా, లేదా పచ్చిగా తినడం అనేది చాలా ప్రమాదకరమణి చెబుతున్నారు.(Note: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన మేరకు మాత్రమే అందించబినవి.. వీటిని టీవీ9 దృవీకరించట్లేదు)

5 / 5