- Telugu News Photo Gallery Top scooters to buy in india 2023 honda activa tvs jupiter ntorq suzuki in list, here is the detail
Top Scooters: ఐఫోన్ ధరకే టాప్ స్కూటర్లు.. కిక్కెక్కించే ఫీచర్లు, కిర్రాక్ మైలేజ్.. ఓసారి చూసేయ్యండి..
స్కూటర్ల పరంగా హోండా, టీవీఎస్, సుజుకీ వంటి కంపెనీలు కస్టమర్లకు మొదటి ఆప్షన్‌గా నిలుస్తాయి. ఇక తాజాగా గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే.. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్లలో హోండా యాక్టివా ముందు వరుసలో ఉంది.
Updated on: May 01, 2023 | 12:33 PM

ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహనాల మార్కెట్‌లో భారతదేశం ఒకటి. ఇక్కడ మోటార్ సైకిళ్లే కాకుండా స్కూటర్లు కూడా బాగా అమ్ముడుపోతాయి. బైక్ సెగ్మెంట్లో హీరో మోటోకార్ప్, బజాజ్, టీవీఎస్ వంటి బ్రాండ్లు అగ్రస్థానంలో నిలవగా, స్కూటర్ల పరంగా హోండా, టీవీఎస్, సుజుకీ వంటి కంపెనీలు కస్టమర్లకు మొదటి ఆప్షన్‌గా నిలుస్తాయి. ఇక తాజాగా గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే.. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్లలో హోండా యాక్టివా ముందు వరుసలో ఉంది. మరి రూ. 90 వేల కంటే తక్కువ ధరలో, మంచి మైలేజ్ ఇచ్చే టాప్ స్కూటర్లు ఓసారి తెలుసుకుందామా..!

హోండా యాక్టివా: ఈ స్కూటర్ అనేక వేరియంట్లలో మార్కెట్‌లో లభిస్తోంది. ఇందులో Activa 125, Activa 6G వంటి బెస్ట్ ఆప్షన్లు ఉన్నాయి. Activa ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.75,347. అదే సమయంలో, దీని టాప్ వేరియంట్ Activa 125 H-SMART ఎక్స్-షోరూమ్ ధర రూ. 88,093. అలాగే యాక్టివా వాహనం లీటర్‌కు 60 కి.మీ మైలేజ్ ఇస్తుంది.

టీవీఎస్ జూపిటర్: దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్లలో టీవీఎస్ జూపిటర్ రెండో స్థానంలో ఉంది. దీని ధర కూడా రూ.90,000 లోపు ఉంటుంది. భారత మార్కెట్లో టీవీఎస్ జూపిటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.72,190-88,498. వేరియంట్‌లను బట్టి ఈ ధర మారుతుంది. అలాగే ఈ వాహనం లీటర్‌కు 62kmpl మైలేజీని లభిస్తోంది.

టీవీఎస్ ఎన్‌టీఓఆర్‌క్యూ 125 టీవీఎస్ ఎన్‌టీఓఆర్‌క్యూ 125 వాహనం అద్భుతమైన లుక్, డిజైన్‌తో రూపొందించబడింది. ఇది 125cc సెగ్మెంట్‌లోని శక్తివంతమైన బైక్, దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.84,386. ఈ బీఎస్6 వాహనం లీటర్‌కు 56.23 kmpl ఇస్తుంది.

సుజుకి యాక్సెస్ 125 ఈ సుజుకి స్కూటర్‌లో అద్భుతమైన ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.79,600 నుంచి ప్రారంభమవుతుంది. ఈ వాహనం లీటర్‌కు 64 కిమీ ఇస్తుంది.





























