World’s Oldest Trees: ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన చెట్లు ఇవేనట.. వీటి వయస్సును మీరు అస్సలు ఊహించలేరు!
ప్రకృతి ఇదొక అంతుచిక్కని రహస్యం.. ఇందులో మానవుల ఊహలకు అందని ఎన్నో అద్భుతాలు ఉంటాయి. కాలక్రమేన మనుషులు వాటిని గురిస్తూ వస్తున్నారు. ప్రకృతి అద్భుతాలలో చెట్లు కూడా ఉన్నాయి. ఇవి మనషుళ్లా కాదు.. వేల సంవత్సరాలు జీవిస్తాయి. నాగరికతలు మారినా, రాజులు వచ్చి వెళ్ళినా, ఈ చెట్లు మాత్రమే అలానే స్థిరంగా జీవిస్తున్నాయి. వీటిని భూమిపై అత్యంత పురాతన జీవులుగా పిరిగణిస్తున్నారు. ఇంతకు ఇవి ఎక్కడున్నాయి. అవి ఎంత కాలంగా జీవిస్తున్నాయో తెలుసుకుందాం.
Updated on: Dec 04, 2025 | 7:17 PM

మెతుసెలా: ఈ వృక్షం అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంది. ఈ చెట్టు గత 4,800 సంవత్సరాలకు పురాతనమైనది అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ చెట్టు 'బ్రిస్ట్లెకోన్ పైన్' జాతికి చెందినది. ఈ చెట్టు కంకణకార వలయాల ఆధారంగా అధ్యయనం చేసి శాస్త్రవేత్తలు దీని వయస్సును కనుగొన్నారు. ఈ చెట్టుకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇది ఉన్న ప్రాంతాన్ని ప్రజలకు చెప్పకుండా దాచి ఉంచుతోంది. ఇది ప్రపంచంలోని అత్యంత పురాతనమైన చెట్టలో ఒకటిగా పేరొంది.

ఓల్డ్ టిజికో: ఈ పురాతన వృక్షం స్వీడన్‌లోని ఒక జాతీయ ఉద్యానవనంలో ఉంది. ఈ చెట్టు వయస్సు దాదాపు 9,550 ఏళ్లు ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది చూడ్డానికి చిన్నగా కనిపించినప్పటికీ దీనికి ఎంతో చరిత్ర ఉంది. దీని ప్రత్యేక ఏంటంటే.. దీని పాత కాండం చనిపోతే.. అదే ప్లేస్ కొత్త కాండం పెరుగుతుంది. కార్బన్ డేటింగ్ అనే సాంకేతికత ద్వారా శాస్త్రవేత్తలు దాని వయస్సును నిర్ణయించారు.

జోమోన్ సుగి: ఈ పురాతన వృక్షం జపాన్‌లోని యకుషిమా ద్వీపంలో ఉంది. ఈ చెట్టు వయస్సు 2,000 నుండి 7,000 సంవత్సరాల మధ్య ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీన్ని చూడాలంటే అడవిలోకి సుమారు కొన్ని కిలో మీటర్లు నడవాల్సి ఉంటుంది.

గ్రాన్ అబులో: ఈ చెట్టు దక్షిణ అమెరికా అడవుల్లోని చిలీలో ఉంది. ఈ చెట్టును 'గ్రేట్ గ్రాండ్‌ఫాదర్' అని పిలుస్తారు. 2022 నాటికి దీని వయస్సు దాదాపు 5,484 సంవత్సరాలు ఉంటుందని పరిశోధకులు అంచనా వేశారు. ఇది సైప్రస్ జాతికి చెందిన చెట్టు.

సర్వ్-ఎ అబార్కు: ఈ పురాతన వృక్షం ఇరాన్ లో ఉంది. ఈ చెట్టు దాదాపు 4,000 సంవత్సరాల నాటిది. ఇది పెర్షియన్ సైప్రస్ జాతికి చెందినది. ఇది చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఇది ఇరాన్ ముఖ్యమైన సహజ స్మారక చిహ్నంగా కొనసాగుతుంది. దీని మందపాటి కాండం, ఆకారం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది.




