- Telugu News Photo Gallery This is what happens if you keep silver elephant idols in the house, check here is details in Telugu
Vastu Tips: ఇంట్లో వెండి ఏనుగు విగ్రహాలను పెట్టుకుంటే.. ఏం జరుగుతుంది?
వాస్తు శాస్త్రంలో అనేక దోషాలకు పరిహారాలు ఉంటాయి. ఇంట్లో సంతోషం, శాంతి, శ్రేయస్సు వెల్లి విరిసేందుకు వాస్తు శాస్త్రంలో అనేక మార్గాలు ఉంటాయి. ఈ క్రమంలోనే ఏనుగు విగ్రహాలకు వాస్తు శాస్త్రంలో చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఏనుగు బొమ్మలను ఇంట్లో పెట్టుకోవడం వల్ల పలు వాస్తు దోషాలకు చెక్ పెట్టొచ్చు. అయితే వెండి లోహంతో చేసిన ఏనుగు విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటే చాలా ప్రయోజనాలు కలుగుతాయి. వినాయకుడు ఏనుగుతో సంబంధం కలిగి ఉంటాడు. ఏనుగు చాలా తెలివైన జీవి..
Updated on: Mar 05, 2024 | 2:24 PM

వాస్తు శాస్త్రంలో అనేక దోషాలకు పరిహారాలు ఉంటాయి. ఇంట్లో సంతోషం, శాంతి, శ్రేయస్సు వెల్లి విరిసేందుకు వాస్తు శాస్త్రంలో అనేక మార్గాలు ఉంటాయి. ఈ క్రమంలోనే ఏనుగు విగ్రహాలకు వాస్తు శాస్త్రంలో చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఏనుగు బొమ్మలను ఇంట్లో పెట్టుకోవడం వల్ల పలు వాస్తు దోషాలకు చెక్ పెట్టొచ్చు. అయితే వెండి లోహంతో చేసిన ఏనుగు విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం

వినాయకుడు ఏనుగుతో సంబంధం కలిగి ఉంటాడు. ఏనుగు చాలా తెలివైన జీవి. దీర్ఘాయువు కూడా ఎక్కువ. సహనంగా కనిపిస్తూనే అవసరం అయినప్పుడు దాని గంభీరాన్ని కూడా ప్రదర్శిస్తూ ఉంటుంది. ఇంట్లో వెండి ఏనుగు పెట్టుకుంటే లక్ష్మీ దేవి అనుగ్రహం కూడా కలుగుతుందట.

ఇంటి ఉత్తర దిశలో ఒక జత వెండి ఏనుగులను ఉంచితే.. పాజిటివ్ ఎనర్జీ కలగడంతో పాటు ఆర్థికంగా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంతే కాదు వృత్తి, వ్యాపారాల్లో కూడా పురోగతి లభిస్తుంది.

పిల్లలు చదువుకునే గదిలో వెండి ఏనుగు విగ్రహాన్ని ఉంచితే పిల్లలకు చదువు పట్ల ఏకాగ్రత, ఆసక్తి పెరుగుతుందని, విజయం కూడా లభిస్తుందని వాస్తు శాస్త్రం చెబుతుంది. ఇంట్లో వెండి లేదా ఇత్తడి ఏనుగులను ఉంచడం చాలా మంచిది.

బెడ్ రూమ్‌లో ఏనుగు విగ్రహాలను ఉంచితే.. భార్యాభర్తల మధ్య మంచి సంబంధం ఏర్పడుతుంది. దంపతులు దాంపత్యం కూడా దృఢంగా మారుతుందని నమ్మకం. అయితే ఏనుగు విగ్రహాన్ని ఉంచిన దిశ ప్రకారం.. ఇంటిపై పడే ప్రభావం మారుతుంది.




