- Telugu News Photo Gallery Cinema photos This Heroine First Movie Disaster, She Is Heroine Ishwarya Menon Childhood Photo
Tollywood : చేసిన ఒక్క సినిమా అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే.. నెట్టింట గ్లామర్ అరాచకం ఈ వయ్యారి.. ఎవరీ ముద్దుగుమ్మ..
తెలుగులో ఆమె చేసిన ఫస్ట్ మూవీ అట్టర్ ప్లాప్ అయ్యింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ ఇండస్ట్రీలో అంతగా గుర్తింపు రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. రెగ్యులర్ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టగలరా.. ? ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో అవకాశాల కోసం ఎదురుచూస్తుంది.
Updated on: Mar 31, 2025 | 10:00 PM

సోషల్ మీడియాలో ప్రస్తుతం గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది ఈ హీరోయిన్. తెలుగులో ఆమె చేసిన ఫస్ట్ మూవీ డిజాస్టర్ అయ్యింది. దీంతో ఈ బ్యూటీకి అంతగా క్రేజ్ రాలేదు... కానీ నటనపరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఆమె మరెవరో కాదు ఐశ్వర్య మీనన్.

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన స్పై సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఐశ్వర్య మీనన్. ఈ సినిమాలో గ్లామర్ పరంగానే కాకుండా యాక్షన్ తోనూ మెప్పించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.

ఆ తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకున్న ఐశ్వర్య ఇప్పుడు భజే వాయువేగం సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హీరో కార్తీకేయ నటించిన ఈ సినిమాకు అంతగా రెస్పాన్స్ రాలేదు. తెలుగులో ఈ బ్యూటీకి అంతగా క్రేజ్ రాలేదు.

ప్రస్తుతం ఈ అమ్మడుకు తెలుగులో అంతగా అవకాశాలు రావడం లేదు. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఐశ్వర్య. నిత్యం క్రేజీ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

ప్రతి సినిమాను తాను ఇష్టపడే చేస్తానని.. కానీ మూవీ ఫలితం అనేది తన చేతుల్లో ఉండదని తెలిపింది. తాను చేసే సినిమాలన్నీ సూపర్ హిట్ కావాలని మాత్రమే తాను కోరుకుంటానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.





























