- Telugu News Photo Gallery These zodiac signs should not wear pearls at all, check here is details in Telugu
Astrology: ఈ రాశుల వారు ముత్యాలను అస్సలు ధరించకూడదట..
ముత్యాలు అంటే చాలా మంది లేడీస్‌కు ఇష్టం. వీటిని ధరించడం వల్ల లుక్కే మారిపోతుంది. కొత్త అందం వస్తుంది. ముత్యాలు చాలా ఫేమస్ ఐటెమ్. విదేశాలు కూడా ఎంతో ఇష్టంగా ముత్యాలను ధరిస్తూ ఉంటారు. నవరత్నాల్లో ముత్యాలు కూడా ఒకటి. నవరత్నాలు అనేవి జీవితాలపై చాలా ప్రభావం చూపిస్తాయన్న విషయం చాలా మందికి తెలీదు. వీటిని ఎవరు పడితే వాళ్లు ధరించకూడదు. ఈ నియమం ముత్యాలకు కూడా వర్తిస్తుంది. కొన్ని రాశుల వారు ముత్యాలను..
Updated on: Jul 28, 2024 | 1:32 PM

ముత్యాలు అంటే చాలా మంది లేడీస్‌కు ఇష్టం. వీటిని ధరించడం వల్ల లుక్కే మారిపోతుంది. కొత్త అందం వస్తుంది. ముత్యాలు చాలా ఫేమస్ ఐటెమ్. విదేశాలు కూడా ఎంతో ఇష్టంగా ముత్యాలను ధరిస్తూ ఉంటారు. నవరత్నాల్లో ముత్యాలు కూడా ఒకటి.

నవరత్నాలు అనేవి జీవితాలపై చాలా ప్రభావం చూపిస్తాయన్న విషయం చాలా మందికి తెలీదు. వీటిని ఎవరు పడితే వాళ్లు ధరించకూడదు. ఈ నియమం ముత్యాలకు కూడా వర్తిస్తుంది. కొన్ని రాశుల వారు ముత్యాలను అస్సలు ధరించకూడదు. మరి ఆ రాశుల వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.

మిథున రాశి వారు ముత్యాలను అస్సలు ధరించకూడదు. ఆడవారైనా, మగవారైనా వీటిని ధరించక పోవడమే చాలా మేలు. ఈ రాశి వారు ముత్యాలను ధరిస్తే.. చాలా రకాల సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఎలాంటి పనులు పూర్తి కాకుండా మధ్యలోనే ఆగిపోతాయి.

మకర రాశి వారు కూడా ముత్యాలను ధరించకుండా ఉండటమే మంచిది. ఈ రాశి వారు ముత్యాలను ధరించడం వల్ల అనేక ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఎలాంటి పనులు కూడా త్వరగా పూర్తి కావు.

అదే విధంగా కుంభ రాశి వారు కూడా ముత్యాలను ధరించ కూడదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ రాశి వారు ముత్యాలను ధరించడం వల్ల శని దేవుని ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది. ఇంట్లో దు:ఖం, మానసిక సమస్యలు ఎక్కువ అవుతాయట.




