Yoga Asanas: తరచూ ఒత్తిడి, ఆందోళనకు లోనవుతున్నారా..? ఈ సింపుల్ ఆసనాలతో సమస్యకు వెంటనే చెక్ పెట్టేయండి..

Asanas for Stress Relief: వ్యక్తిగత, వృత్తి బాధ్యతల నడుమ ఒత్తడి, ఆందోళనలు మన జీవితంలో భాగంగా మారిపోయాయి. ఇక వీటి కారణంగానే అనారోగ్యంతో పాటు చర్మ, కేశ సమస్యలు ఎదురవుతాయి. మీరు కనుక ఈ ఒత్తిడి, ఆందోళనల నుంచి బయట పడాలనుకుంటే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అయితే ఆహారంతోనే సరిపోదు.. శారీరక శ్రమ లేదా వ్యాయామం కూడా అంతే అవసరం. ఈ క్రమంలో మీరు ఇంట్లోనే కొన్ని రకాల ఆసనాలను ఆశ్రయించవచ్చు. వీటితో ఆరోగ్యం మెరుగు పడడంతో పాటు ఒత్తిడి, ఆందోళన దూరమవుతాయి.

శివలీల గోపి తుల్వా

|

Updated on: Aug 12, 2023 | 8:05 PM

Yoga For Stress Relief: మానసిక, శారీరక ఒత్తిడి, ఆందోళన కోసం యోగా మంచి ఎంపిక. ఈ క్రమంలో మీరు ఏయే ఆసనాలను వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
వృక్షాసనం:వృక్షాసనం చేయడం వల్ల శరీరానికి పరిహార శక్తి, మానసిక ప్రశాంతంగా కలుగుతాయి. అలాగే ఏకాగ్రత పెరుగుతుంది.

2 / 5
సుఖాసన: ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు సుఖనాసం చాలా ఉపయోగకరంగా పనిచేస్తుంది. ఇందుకోసం మీరు ప్రతి రోజూ కనీసం 5 నిమిషాల పాటు సుఖాసన సాధన చేస్తే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది.

3 / 5
బాలసన: బాలసానం చేయడం వల్ల భుజం, వీపు, మెడ నొప్పులు తగ్గుతాయి. అలాగే శరీర నాడీ వ్యవస్థ పనితీరు మెరుగై మానసిక రుగ్మతల నుంచి ఉపశమనం పొందుతారు.

4 / 5
మకరాసనం: మకరాసనం రోజూ చేయడం వల్ల మానసిక చంచలత్వం, నిరాశ నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే ఉద్యోగ బాధ్యతల్లో ఎదురయ్యే ఒత్తిడి, ఆందోళనపై నియంత్రణ సాధిస్తారు.

5 / 5
Follow us