Onions Rings: కరకరలాడే ఆనియన్స్ రింగ్స్.. పదే నిమిషాల్లో సిద్ధం..

రోజూ తిన్నవే తిన్నా బోర్ కొడుతూ ఉంటాయి. ఏవైనా కొత్తగా తినాలనిపిస్తూ ఉంటుంది. అలా కొత్తగా తినాలినిపిస్తే.. ఎప్పుడూ ఉల్లిపాయలతో పకోడీలే కాకుండా.. ఇలా వెరైటీగా రింగ్స్ తయారు చేయండి. కరకరలాడుతూ.. డిఫరెంట్‌గా చాట్ మసాలా ఫ్లేవర్‌తో చాలా రుచిగా ఉంటాయి. తిన్న కొద్దీ ఇంకా తినాలనిపిస్తూ ఉంటాయి..

Onions Rings: కరకరలాడే ఆనియన్స్ రింగ్స్.. పదే నిమిషాల్లో సిద్ధం..
Onion Rings
Follow us
Chinni Enni

| Edited By: Ram Naramaneni

Updated on: Dec 22, 2024 | 9:31 PM

ప్రతిరోజూ సాయంత్రం అయ్యిందంటే చాలు.. ఖచ్చితంగా ఏదో ఒకటి స్నాక్స్ మన పొట్టలో పడాల్సిందే. అయితే రోజూ తిన్నవే తిన్నా బోర్ కొడుతూ ఉంటాయి. ఏవైనా కొత్తగా తినాలనిపిస్తూ ఉంటుంది. అలా కొత్తగా తినాలినిపిస్తే.. ఎప్పుడూ ఉల్లిపాయలతో పకోడీలే కాకుండా.. ఇలా వెరైటీగా రింగ్స్ తయారు చేయండి. కరకరలాడుతూ.. డిఫరెంట్‌గా చాట్ మసాలా ఫ్లేవర్‌తో చాలా రుచిగా ఉంటాయి. తిన్న కొద్దీ ఇంకా తినాలనిపిస్తూ ఉంటాయి. వీటిని ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. మరి ఈ ఆనియన్ రింగ్స్ ఎలా తయారు చేస్తారు? వీటిని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి.

ఆనియన్ రింగ్స్‌ తయారీకి కావాల్సిన పదార్థాలు:

ఉల్లిపాయలు, కారం, ఉప్పు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, బ్రెడ్ పౌడర్, చాట్ మసాలా, మైదా పిండి, ఆయిల్.

ఆనియన్ రింగ్స్‌ తయారీ విధానం:

ముందుగా ఉల్లిపాయలను విడివిడిగా కట్చేసిన రింగు రింగులుగా పెట్టుకోవాలి. వీటిని ఓ పది నిమిషాల పాటు నీటిలో నానబెట్టుకోవాలి. మరో గిన్నె తీసుకుని అందులో కారం, ఉప్పు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, బ్రెడ్ పౌడర్, చాట్ మసాలా, మైదా పిండి, కొద్దిగా నీళ్లు వేసి కాస్త చిక్కగా పిండిని కలుపుకోవాలి. ఈలోపు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి వేడి చేసుకోవాలి. ఆ తర్వాత నీటిలో నానబెట్టిన ఉల్లిపాయ రింగ్స్.. పిండిలో వేసి అటూ ఇటూ తిప్పాలి.

ఇవి కూడా చదవండి

మొత్తం కోటింగ్ అంతా రింగ్స్ పట్టేలా చేసుకోవాలి. ఆ తర్వాత వీటిని బ్రెడ్ పొడిలో వేసి మొత్తం కోటింగ్ చేయాలి. ఇప్పుడు వీటిని ఆయిల్‌లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఎర్రగా వేయించుకున్నాక ఓ ప్లేట్‌లోకి తీసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే ఆనియన్ రింగ్స్ సిద్ధం. వీటిని టమాటా సాస్‌తో తింటే మరింత రుచిగా ఉంటాయి. వీటిని చాలా సులువగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు వీటిని ఒకసారి చేసి పెట్టండి. ఖచ్చితంగా నచ్చుతాయి.