కెనడాలో పౌరసత్వం ఎలా పొందాలి?

TV9 Telugu

22 December 2024

కెనడియన్ పౌరుడిగా మారడానికి, ఆ దేశ ప్రభుత్వం నియమాలు ప్రకారం.. మీరు కెనడాలో శాశ్వత నివాసాన్ని కలిగి ఉండాలి.

కెనడా పౌరసత్వం కావాలంటే మీరు ఇంగ్లీష్ లేదా ఫ్రెంచ్ భాషలో మంచి మాట్లాడే మరియు వినగలిగే నైపుణ్యాలను కలిగి ఉండాలి.

ఈ దేశ పౌరసత్వం కోసం దరఖాస్తు చేయడానికి ముందు గత 5 సంవత్సరాలలో 3 సంవత్సరాలు కెనడాలోనే నివసించి ఉండాలి.

అలాగే, ఆ దేశ ప్రభుత్వ నియమాలు ప్రకారం.. మీరు ఈ మూడు సంవత్సరాలలో కెనడా దేశంలో పన్నులు చెల్లించడం అవసరం.

ఇది జరగకపోతే, మీరు కెనడా దేశ ప్రభుత్వం శాశ్వతంగా పౌరసత్వం పొందడానికి అన్హరులుగా పరిగణించడం జరుగుతుంది.

కెనడా దేశంలో పౌరసత్వాన్ని పొందేందుకు, దరఖాస్తుదారు తప్పనిసరిగా పౌరసత్వ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి.

పౌరసత్వం కోసం జరిగే ఈ పరీక్ష సమయంలో దరఖాస్తుదారుని కెనడియన్ పౌరుల బాధ్యతలు, హక్కుల గురించి ప్రశ్నలు అడుగుతారు.

మీరు కూడా కెనడియన్ పౌరసత్వం పొందాలనుకుంటే, మీరు canada.ca వెబ్‌సైట్‌ని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.