Uterus Infection: ఆ సమయంలో భరించలేని కడుపునొప్పి వేదిస్తుందా? బీ కేర్ ఫుల్.. ఇది కారణం కావచ్చు

రోజు వారి జీవితంలో మనం చేసే చిన్న చిన్న తప్పులే ఆ తర్వాత వెల కట్టలేని మూల్యం చేల్లించుకోవడానికి దారి తీస్తాయి. అటువంటి వాటిల్లో గర్భాశయ ఇన్ఫెక్షన్ ఒకటి. అసలు ఇది ఎందుకు వస్తుంది? ఇది వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? నివారణకు ఏయే చికిత్సలు తీసుకోవాలి? వంటి విషయాలు ఈ కింద తెలుసుకుందాం..

Uterus Infection: ఆ సమయంలో భరించలేని కడుపునొప్పి వేదిస్తుందా? బీ కేర్ ఫుల్.. ఇది కారణం కావచ్చు
Uterus Infection
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 22, 2024 | 8:32 PM

గర్భాశయం ఇన్ఫెక్షన్ మహిళల్లో ఒక సాధారణ సమస్య. అయితే దీని ప్రారంభ లక్షణాలు గుర్తించి వెంటనే చికిత్స తీసుకుంటే ప్రమాదం నుంచి బయటపడొచ్చు. ఎందుకంటే ఈ వ్యాధిని సకాలంలో గుర్తించకపోతే, ఈ వ్యాధి తీవ్ర రూపం దాల్చుతుంది. ఇది తల్లి కావాలనుకునే వారికి పెను ప్రమాదం తెచ్చిపెడుతుంది. ఎందుకంటే గర్భాశయంలో ఇన్ఫెక్షన్ ఉంటే, నేరుగా వంధ్యత్వానికి కారణం అవుతుంది. గర్భాశయం ఇన్ఫెక్షన్ సమస్య ఎప్పుడు తీవ్రరూపం దాలుస్తుందో అంత తేలికగా అంచనా వేయలేమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందువల్ల, లక్షణాలను సకాలంలో గుర్తించడం చాలా ముఖ్యం. కొంతమంది మహిళలు ఈ లక్షణాలను పట్టించుకోకుండా, తీవ్రమయ్యేంత వరకూ కాలయాపన చేస్తుంటారు. ఇది ప్రమాదకరం కావచ్చు.

గర్భాశయ ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి?

శరీరంలో అనేక రకాల ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు ఉంటాయి. ఏదైనా బాక్టీరియా మహిళల ప్రైవేట్ భాగాల గుండా వెళ్లి గర్భాశయంలోకి చేరినట్లయితే, అది గర్భాశయంలో ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ కూడా తర్వాత వంధ్యత్వానికి కారణం కావచ్చు. కాబట్టి, దీనిని తేలికగా తీసుకోకూడదు. ఈ కింది లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

గర్భాశయ ఇన్ఫెక్షన్ లక్షణాలు

  • కటి ప్రాంతంలో వాపు కనిపిస్తుంది
  • పొత్తికడుపులో వాపు
  • మూత్రవిసర్జన చేసేటప్పుడు నొప్పి లేదా మంటగా అనిపించడం
  • మూత్ర విసర్జన సమయంలో నొప్పి సాధారణంగా UTI లక్షణం. ఒక్కోసారి ఇది గర్భాశయ ఇన్ఫెక్షన్‌కు కూడా కారణం కావచ్చు
  • కడుపు నొప్పి
  • కడుపులో గ్యాస్, మలబద్ధకం
  • కాలేయ వ్యాధి లేకుండానే కడుపు నొప్పి ఉంటే వైద్యుడిని సంప్రదించాలి
  • పీరియడ్స్‌ సమయంలో భరించలేని నొప్పి

గర్భాశయ ఇన్ఫెక్షన్ నివారణ మార్గాలు

  • రెగ్యులర్ చెకప్‌
  • శుభ్రత పట్ల శ్రద్ధ వహించడం
  • సమతుల్య ఆహారం తీసుకోవడం

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం క్లిక్‌ చేయండి.