పాప్‌కార్న్‌ ఇలా తయారు చేసి తిన్నారో.. నేరుగా యమలోకానికి వెళ్లొచ్చు!

22 December 2024

TV9 Telugu

TV9 Telugu

పాప్‌కార్న్‌.. పిల్లలు, పెద్దలు అనే తారతమ్యం లేకుండా ప్రతిఒక్కరూ ఇష్టపడే ఆహారపదార్థాల్లో ఇదీ ఒకటి. సినిమా అనగానే ఠక్కున గుర్తుకొచ్చే మంచి స్నాక్ ఐటమ్ కూడా ఇదే

TV9 Telugu

సినిమా చూడాలనున్నా, స్నేహితులతో కూర్చొని సరదాగా కబుర్లు చెప్పాలనుకున్నా చేతిలో పాప్‌కర్న్‌ ఉండాల్సిందే. అందుకే ఇది చాలామందికి ఇష్టమైన చిరుతిండిగా మారిపోయింది. పాప్‌కార్న్ తినడానికి రుచికరంగా ఉండటమే కాదు, ఆరోగ్యానికి కూడా అనేక విధాలుగా మేలు చేస్తుంది

TV9 Telugu

మొక్కజొన్నల నుంచి తయారయ్యే ఈ పాప్‌కార్న్‌లో ఉండే పీచు, పాలిఫినోలిక్ సమ్మేళనాలు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ బి కాంప్లెక్స్, మాంగనీస్, మెగ్నీషియం.. మొదలైనవన్నీ ఆరోగ్యానికి ఉపకరించేవేనట

TV9 Telugu

పాప్‌కార్న్‌లో ఉండే పీచు పదార్థాలు రక్తనాళాలు, ధమనుల గోడల్లో పేరుకుపోయిన కొవ్వును సమర్థంగా తగ్గిస్తాయి. తద్వారా శరీరంలోని కొవ్వు స్థాయుల్లో తగ్గుదల కనిపిస్తుంది. ఫలితంగా గుండె జబ్బులు మాయం అవుతాయి

TV9 Telugu

కానీ పాప్‌కార్న్ తయారీలో చేసే కొద్దిపాటి తప్పులు ఆరోగ్యానికి తీవ్ర హాని తలపెడతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో పాప్‌కార్న్‌ను పాన్‌లో సింపుల్‌గా చేసేవారు

TV9 Telugu

కానీ నేటికాలంలో వెన్న, నూనె, రకరకాల మసాలా పొడులు వేసి రుచిగా పాప్‌కార్న్ తింటారు. అయితే ఇవి ఆరోగ్యానికి మంచిదికాదు. నేటికాలంలో ప్యాక్ చేసిన పాప్‌కార్న్‌లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి

TV9 Telugu

వీటిని 2 నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో తయారు చేయవచ్చు. అయితే ప్రిజర్వేటివ్‌ నూనెతో తయారు చేసిన పాప్‌కార్న్‌లు అనారోగ్యకరమైనవి

TV9 Telugu

చాలా మంది పాప్‌కార్న్‌ను మైక్రోవేవ్ బ్యాగ్‌లో వేసి తయారు చేస్తారు. వీటిలో రసాయనాలు కలపడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. అందుకే పాప్‌కార్న్‌ను మార్కెట్‌లో కొనుగోలు చేసి పిల్లలకు తినిపించడం అంతమంచిది కాదు