బంపర్ ఆఫరంటే వీరిదే.. జూలై నెలలో అదృష్ట రాశులు వీరే!
12 రాశుల్లో జూలై నెలలో మూడు రాశులకు బంపర్ ఆఫర్ తగలనుంది. అనుకోని మార్గాల ద్వారా అనేక ప్రయోజనాలు అందుకోనున్నారు. ఊహించని విధంగా వీరిని అదృష్టం తలపు తట్ట నుంది. ఇంతకీ ఆ రాశుల వారు ఎవరు? అనుకుంటున్నారా? చూసేద్దాం పదండి.
Updated on: Jul 12, 2025 | 1:00 PM

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు రాశులను మార్చడం అనేది కామన్. ప్రతి నెలలో గ్రహాలు తమ రాశిని మార్చుకుంటాయి. అయితే శక్తివంతమైన సూర్య గ్రహం తన రాశిని మారి మరో రాశిలోకి సంచారం చేయనుంది. జూలై 16వ తేదీన సూర్యుడు కర్కాటక రాశిలోకి సంచారం చేయనున్నాడు. దీని వలన మూడు రాశుల వారికి అదృష్టం తలుపు తట్టనుంది. వాళ్ళు జీవితంలో అనేక అద్భుతాలు, ఆనందాలు చోటు చేసుకుంటాయి. ఇంతకీ ఆ రాశుల వారు ఎవరంటే?

మిథున రాశి : మిథున రాశి వారికి కర్కాటక రాశిలోకి సూర్యుడి సంచారం వలన పట్టిందల్లా బంగారమే కానుంది. వీరు ఏ పని చేసినా అందులో సక్సెస్ అవ్వడం ఖాయం. పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు. కోర్టు వ్యవహారాలు వీరికి అనుకూలంగా వస్తాయి. విద్యార్థులకు , వ్యాపారస్తులకు, రియలెస్టేట్ రంగంలో ఉన్న వారికి అద్భుత ప్రయోజనాలు చేకూరుతాయంట.

కన్యా రాశి : జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడి సంచారానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇది 12 రాశులను ప్రభావితం చేస్తుంది. అయితే కర్కాటక రాశిలోకి సూర్యుడి సంచారం వలన కన్యా రాశి వారికి ఊహించని లాభాలు కలుగుతాయి. ధనలాభ సూచన ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. కళారంగంలో ఉన్న వారు అనేక లాభాలు పొందుతారు. వ్యాపారస్తులకు అద్భుతంగా ఉండబోతుంది.

కన్యా రాశి : అంతే కాకుండా వీరు ఏ పని చేసినా అందులో ఊహించని విధంగా వీరు విజయం అందుకుంటారు. వైవాహిక జీవితంలో ఆనందాలు విల్లివిరుస్తాయి. విద్యార్థులు మంచి ర్యాంకులు పొందుతారు. పాఠశాలలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ఈ రాశి వారికి సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి.

ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి సూర్య సంచారం అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఏ పని చేసినా కలిసి వస్తుంది. ఆకస్మిక ధన లాభం పొందే ఛాన్స్ ఉంది. చాలా రోజుల నుంచి వసూలు కానీ మొండి బాకీలు వసూలు అవుతాయి. ఎవరైతే కొత్త వస్తువుల లేదా స్థిరాస్తి కొనుగోలు చేయాలని కలలు కంటున్నారో వారి కలలు నిజమయ్యే సమయం ఇది. ఈ రాశి వారికి అనుకోని విధంగా అదృష్టం తలుపు తడుతుందంట.



