Nagarjuna: నాగార్జున మీద రజినీ ఫ్యాన్స్ కోపంగా ఉన్నారా ?? కారణం అదేనా !!
నాగార్జున మీద రజినీకాంత్ ఫ్యాన్స్ కోపంగా ఉన్నారా..? అదేంటి అలా అంటున్నారు..? కూలీ సినిమాలో నటిస్తున్నారు పైగా తన ఇమేజ్ పక్కనబెట్టి మరీ రజినీ కోసం ఫస్ట్ టైమ్ విలన్ అవుతున్నారు.. ఇలాంటి సమయంలో వాళ్లెందుకు నాగ్ మీద కోపంగా ఉంటారు అనుకుంటున్నారా..? అయితే మీరు ఈ స్టోరీ చూసేయాల్సిందే..
Updated on: Jul 12, 2025 | 12:39 PM

ఇంకెన్నాళ్లు హీరోగా నటిస్తాం.. 60 ఏళ్లు దాటిపోయాయి.. ఇమేజ్ కూడా మారిపోయింది.. ఇంకా హీరోయిన్ల వెంట పడుతూ డ్యూయెట్లు పాడితే చూసేవాళ్లకు కూడా బాగోదు అని ఫిక్సైపోయారు నాగార్జున. అందుకే తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు.

డిఫెరెంట్ క్యారెక్టర్స్ వైపు అడుగులేస్తున్నారు. ఈ క్రమంలోనే కుబేరతో తొలి అడుగు వేసారీయన. ధనుష్, శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లో వచ్చిన కుబేరాలో చాలా ఇంపార్టెంట్ రోల్ చేసారు నాగార్జున. అది హీరో కాదు.. అలాగని విలన్ కూడా కాదు.. పరిస్థితులకు తగ్గట్లు మారిపోయే పాత్ర.

కుబేర తర్వాత నాగ్ కథల ఎంపికలో కూడా మార్పులు వచ్చాయి. మరోవైపు రజినీకాంత్ కూలీలోనూ ఈయన విలన్‌గా నటిస్తున్నారు. కాకపోతే రజినీ ఫ్యాన్స్ ఇప్పుడు నాగ్‌పై కాస్త కోపంగా ఉన్నారు. లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న కూలీలో కేవలం నాగ్ మాత్రమే కాదు.. ఉపేంద్ర, అమీర్ ఖాన్ కూడా నటిస్తున్నారు.

అయితే ఈ సినిమా కథ మొత్తం నాగార్జున లీక్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఆయనపై రజినీ ఫ్యాన్స్ కాస్త కినుక వహిస్తున్నారు. తాను విలన్ అని.. తనకు రజినీ కాంబోలో సీన్స్ ఉంటాయని.. అమీర్ క్లైమాక్స్‌లో వస్తారంటూ లీక్ చేసారు నాగార్జున.

కూలీ రిలీజ్ వరకు నాగార్జున విలన్ అనే సంగతి దాచాలనుకున్నారు మేకర్స్. కానీ కుబేరా ఇంటర్వ్యూల్లో అది రివీల్ చేసారు నాగ్. ఆ తర్వాత కూలీలోని యాక్షన్ సీన్స్, క్యారెక్టర్స్‌పై లీక్స్ ఇచ్చారు నాగార్జున. ఆగస్ట్ 14న ఈ సినిమా విడుదల కానుంది.. అప్పటి వరకు ప్లీజ్ నాగ్.. డోంట్ రివీల్ ఎనీథింగ్ అంటున్నారు రజినీ ఫ్యాన్స్.




