- Telugu News Photo Gallery This is the movie that Mohan Babu got a super hit with the movie that Chiranjeevi rejected
చిరంజీవి ఛీ కొట్టిన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న క్రేజీ విలన్ ఈయనే!
చిత్ర పరిశ్రమలో ఒక హీరో రిజక్ట్ చేసిని సినిమాతో మరో హీరో హిట్ అందుకోవడం కామన్. ఇలాంటి సంఘటనలు అనేక సందర్భాల్లో జరుగుతుంటాయి. అయితే ఈ మధ్యకాలంలో ఈ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కెర్లు కొడుతుంది. అది ఏమిటంటే? చిరు ఛీ కొట్టి వదిలేసిన ఓ సినిమా కథతో టాలీవుడ్ క్రేజీ విలన్, హీరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడంట. ఇంతకీ అది ఏ సినిమా అంటే?
Updated on: Jul 12, 2025 | 1:01 PM

మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఎలాంటి సపోర్ట్ లేకుండా తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టి తన స్వయం కృషితో మెగాస్టార్‌గా ఎదిగారు. చిరంజీవి నటన, డ్యాన్స్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఆ తరం వారికే కాకుండా ఈ తరం వారికి కూడా చిరంజీవి అంటే విపరీతమైన అభిమానం ఉంటుంది.

ఇక చిత్ర పరిశ్రమలో ఉన్న ఏ హీరో అయినా సరే కొన్ని సందర్భాల్లో పలు కథలను రిజక్ట్ చేయడం అనేది కామన్. అయితే చిరంజీవి కూడా తన కెరీర్‌లో చాలా సినిమా కథలను రిజక్ట్ చేశాడంట. ఆయన వదులుకున్న సినిమా కథలతో కొంత మంది హీరోలు హిట్స్ అందుకుంటే, మరికొందరు ప్లాప్ తన ఖాతాలో వేసుకున్నారంట.

అయితే ఓ టాలీవుడ్ క్రేజీ విలన్, ఇప్పుడు స్టార్ సీనియర్ హీరో మాత్రం చిరంజీవి వదిలేసిని ఓ సినిమాతో ఓ వరనైట్ స్టార్ హీరోగా మారి, టాలీవుడ్‌లోనే తిరుగులేని హీరోగా తన సత్తా చాటాడంట. ఇంతకీ ఆ హీరో ఎవరు అనుకుంటున్నారా? టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్ బాబు

మోహన్ బాబు చిత్ర పరిశ్రమలోకి అడుకు పెట్టిన మొదట్లో చాలా సినిమాల్లో విలన్ పాత్రలో నటించి మెప్పించారు. అలాగే చిరంజీవి నటించిన అత్యధిక సినిమాల్లో ఈయన విలన్‌గా చేశారు. విలన్‌గా మంచి పేరు సంపాదించుకున్న మోహన్ బాబు, హీరోగా చేసిన మొట్టమొదటి సినిమాను చిరంజీవి రిజక్ట్ చేశాడు. ఇంతకీ అది ఏమిటంటే?

మోహన్ బాబు కెరీర్ లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అంటే అసెంబ్లీరౌడీ. ఈ సినిమా 1991లో రిలీజై కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమాలో మొదటిసారిగా మోహన్ బాబు హీరోగా నటించారు. మొదటి సినిమాతో మంచి హిట్ అందుకొని స్టార్‌గా నిలిచారు. అయితే ఈ సినిమాను మొదటగా దర్శకుడు చిరంజీవితో తీయాలనుకొని కథను చిరుకు వినిపించాడంట. కానీ చిరు కథలో లోపాలు ఉండటంతో నేను చేయను అని తెగేసి చెప్పడంతో దర్శకుడు మోహన్ బాబును సంప్రదించి, ఆయనతో సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.



