- Telugu News Photo Gallery Cinema photos Sandeep Reddy Vanga Following Rajamouli Formula for Prabhas Spirit
Sandeep Reddy Vanga: ఆ లెజెండరీ డైరెక్టర్‌ను ఫాలో అవుతున్న సందీప్ రెడ్డి వంగా
సౌత్ నుంచి వెళ్లి నార్త్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. చేసింది మూడు సినిమాలే అయినా.. బాలీవుడ్‌లో రీసౌండ్ చేస్తోంది సందీప్ పేరు. ఇంత క్రేజ్ ఉన్నా... తన నెక్ట్స్ మూవీ విషయంలో మాత్రం మరో లెజెండరీ డైరెక్టర్‌ను ఫాలో అవుతున్నారు..? ఎవరా డైరెక్టర్ అనుకుంటున్నారా..? అయితే వాచ్ దిస్ స్టోరీ..
Updated on: Jul 12, 2025 | 12:24 PM

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాలతో ఇండియన్ సినిమాను షేక్ చేశారు సందీప్ రెడ్డి వంగా. బోల్డ్ టేకింగ్‌తో కొత్త ట్రెండ్ సెట్ చేశారు. అయితే ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒక ఎత్తు, ఇక మీద చేయబోయే సినిమా ఒక ఎత్తు అన్నట్టుగా ఉంది సందీప్ మేకింగ్ స్టైల్.

త్వరలో ప్రభాస్ హీరోగా స్పిరిట్ సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు సందీప్. ప్రస్టీజియస్‌గా ప్లాన్ చేస్తున్న ఆ సినిమా కోసం రాజమౌళి మేకింగ్ స్టైల్‌ను ఫాలో అవుతున్నారు.

ముఖ్యంగా ప్రీ ప్రొడక్షన్ విషయంలో జక్కన్న ఫార్ములానే రిపీట్ చేస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ స్టేజ్‌లోనే మ్యాగ్జిమమ్ కేర్ తీసుకోవటంతో పాటు ప్రొడక్షన్ విషయంలోనూ పర్ఫాక్ట్ ప్లానింగ్‌తో రెడీ అవుతున్నారు.

షూటింగ్ జరిగినన్ని రోజులు ప్రభాస్ మరో మూవీ చేయోద్దంటూ కండిషన్ పెట్టారు. అంతేకాదు డార్లింగ్ లుక్ విషయంలోనూ ఏ మాత్రం కంప్రామైజ్ కావటం లేదు ఈ స్టార్ డైరెక్టర్.

ప్రజెంట్ ది రాజాసాబ్, ఫౌజీ సినిమాల్లో నటిస్తున్నారు ప్రభాస్. ఈ రెండు సినిమాలు ఎట్టి పరిస్థితిల్లో సెప్టెంబర్ కల్లా పూర్తి చేసి ఆ తరువాత స్పిరిట్ షూటింగ్‌లో జాయిన్ అవుతారు. వీలైనంత త్వరగా స్పిరిట్ షూటింగ్‌ను పూర్తి చేసేలా పర్ఫెక్ట్ ప్లాన్ సిద్ధం చేశారు సందీప్ రెడ్డి వంగా.




