Orange: బీ కేర్ఫుల్.! వీరికి నారింజ పండ్లు విషంతో సమానం.. అస్సలు తినకూడదంట
నారింజ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. చలికాలంలో ఈ పండ్లను తినడం మంచిదని వైద్యులు సూచిస్తుంటారు. కానీ కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు నారింజ పండు తినడం అస్సలు మంచిది కాదట. ఒకవేళ పోనిలే పర్లేదు..
![నారింజ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. చలికాలంలో ఈ పండ్లను తినడం మంచిదని వైద్యులు సూచిస్తుంటారు. కానీ కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు నారింజ పండు తినడం అస్సలు మంచిది కాదట.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/06/oranges-6.jpg?w=1280&enlarge=true)
1 / 6
![ఒకవేళ పోనిలే పర్లేదు.. అని తింటే వారి సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. కాబట్టి ఎవరెవరు నారింజను తినకూడదు. ఏయే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ నారింజ పండ్లకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందామా..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/06/oranges.jpg)
2 / 6
![కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు నారింజ పండ్లకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఆరెంజ్ తింటే.. వారి సమస్య ఇంకాస్త రెట్టింపు అవుతుంది. అలాగే నారింజ పండ్లు కొందరికి గుండెల్లో మంటను కలిగిస్తాయి.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/06/oranges-5.jpg)
3 / 6
![జలుబు, దగ్గుతో బాధపడేవారు నారింజకు దూరంగా ఉండాలట. నారింజలో ఆస్ట్రింజెంట్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి జలుబు, దగ్గుతో బాధపడేవారు వీటికి దూరంగా ఉండాలి. వీటిని తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/06/oranges-4.jpg)
4 / 6
![ఎసిడిటీతో బాధపడేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ నారింజను తినకూడదు. ఎందుకంటే నారింజలో యాసిడ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎసిడిటీతో బాధపడేవారు నారింజ పండ్లను తింటే కడుపులో యాసిడ్ పరిమాణం పెరుగుతుంది. ఇది కడుపు నొప్పికి దారి తీస్తుంది.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/06/orange-2.jpg)
5 / 6
![దంత సమస్యలతో బాధపడేవారు నారింజను తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా దంతాలు బలహీనంగా ఉన్నవారు నారింజకు దూరంగా ఉండాలి. పంటి ఎనామెల్తో పాటు, కాల్షియం, బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. దీంతో దంతాల ఆరోగ్యం దెబ్బతింటుంది.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/06/orange-1.jpg)
6 / 6