- Telugu News Photo Gallery These Nuts And Seeds That Help In Controlling Uric Acid Levels And Reducing Gout Pain
Uric Acid: యూరిక్ యాసిడ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? ఈ డ్రై ఫ్రూట్స్‌తో సమస్యను పారదోలదాం..
వయసు పెరిగే కొద్దీ యూరిక్ యాసిడ్ సమస్యలు ప్రారంభమవుతాయి. ఆహారంలో ఎక్కువ ప్రోటీన్ ఉంటే, శరీరంలో ప్యూరిన్ స్థాయిలు పెరుగుతాయి. ఈ ప్యూరిన్‌లను విచ్ఛిన్నం చేయడం ద్వారా యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. అదనపు యూరిక్ యాసిడ్ శరీరం నుంచి బయటకు వెళ్లకపోతే అది కీళ్లలో పేరుకుపోతుంది. ఫలితంగా గౌట్ సమస్య తలెత్తుతుంది. కాబట్టి యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే ప్రొటీన్లు ఆహారానికి దూరంగా ఉండాలి..
Updated on: Apr 12, 2024 | 4:53 PM

వయసు పెరిగే కొద్దీ యూరిక్ యాసిడ్ సమస్యలు ప్రారంభమవుతాయి. ఆహారంలో ఎక్కువ ప్రోటీన్ ఉంటే, శరీరంలో ప్యూరిన్ స్థాయిలు పెరుగుతాయి. ఈ ప్యూరిన్‌లను విచ్ఛిన్నం చేయడం ద్వారా యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. అదనపు యూరిక్ యాసిడ్ శరీరం నుంచి బయటకు వెళ్లకపోతే అది కీళ్లలో పేరుకుపోతుంది. ఫలితంగా గౌట్ సమస్య తలెత్తుతుంది. కాబట్టి యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే ప్రొటీన్లు ఆహారానికి దూరంగా ఉండాలి. యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగి గౌట్ నొప్పి తగ్గినట్లయితే ఉపశమనానికి మందులు అవసరం. అలాగే ఆహారం తినడం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ కింది 5 రకాల నట్స్, విత్తనాలు యూరిక్ యాసిడ్ను తగ్గించడంలో మీకు సహాయపడతాయి.

యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగితే ఉపశమనం కోసం వాల్ నట్స్ తినవచ్చు. వాల్ నట్స్ లో విటమిన్ ఇ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ గింజలు శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాదు వాల్ నట్స్ లో ఉండే ప్రొటీన్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

బాదంపప్పులో విటమిన్ ఇ, మెగ్నీషియం, మాంగనీస్ వంటి పోషకాలు ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. బాదం రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గిస్తుంది. అలాగే, నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

జీడిపప్పు ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. ఈ గింజలలో ప్యూరిన్ స్థాయిలు కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి జీడిపప్పు తినడం ద్వారా మీరు గౌట్ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

అవిసె గింజల్లో ఆరోగ్యానికి అవసరమైన కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఈ గింజల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి అధిక యూరిక్ యాసిడ్ వల్ల కలిగే శారీరక నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి.




