Brain Stroke: ఈ అలవాట్లు ఉన్నాయా ?.. అయితే జాగ్రత్త.. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువే..
ప్రస్తుత ఈ ఆధునిక కాలంలో మనకు ఉండే కొన్ని అలవాట్లు బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి. మనకు నిత్యం ఉంటే అలవాట్ల వలన అనారోగ్య సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది. మరి ఆ చెడు అలవాట్లు ఏంటో తెలుసుకుందామా.
Updated on: May 02, 2022 | 1:45 PM

ప్రస్తుత ఈ ఆధునిక కాలంలో మనకు ఉండే కొన్ని అలవాట్లు బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి. మనకు నిత్యం ఉంటే అలవాట్ల వలన అనారోగ్య సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది. మరి ఆ చెడు అలవాట్లు ఏంటో తెలుసుకుందామా.

ధుమాపానం.. జ్ఞాపకశక్తిపై హానికరమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అల్జీమర్స్, డిమెన్షియా అభివృద్ధి చెందే ప్రమాదాన్ని మరింత రెట్టింపు చేస్తుంది. అంతేకాకుండా.. ధూమపానం స్ట్రోక్ ప్రమదాన్ని పెంచడమే కాకుండా.. గుండె ఆరోగ్యం, శ్వాసకోశ పనితీరు కూడా ప్రభావితం చేస్తుంది. ఈ అలవాటును వదిలించుకోవాలి.

బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి ఆల్కహల్ ప్రధాన కారణం. రోజుకు రెండు గ్లాసులు కంటే ఎక్కువ ఆల్కహాల్ తాగడం వలన అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది స్ట్రోక్ వచ్చేలా చేస్తుంది. జాగ్రత్తలు అవసరం.

రోజంతా మంచం మీద కూర్చోవడం. ఎక్కువసేపు ఒకేచోట పనిచేయడం వలన ఊబకాయం పెరుగుతుంది. ఇది బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. శారీకంగా చురుగ్గా ఉండాలి. దీనివలన బ్రెయిన్ స్ట్రోక్ మాత్రమే కాదు..మరిన్ని వ్యాధులు తగ్గుతాయి.

అధిక చక్కెర శరీరానికి హానికరం. ఎక్కువ చక్కెర తినడం వలన శరీరానికి హానికరమవుతుంది. దీంతో రక్తపోటు పెరుగుతుంది. అలాగే బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి ఆహారంలో ఎక్కువ ఉప్పు వేసుకోవద్దు.

రాత్రి నిద్రలో పదే పదే లేగడం.. లేదా సరైన నిద్ర లేకపోవడం. దీనివలన ఆక్సీకరణ ఒత్తిడి పెరుగుతుంది. ధమనులను దెబ్బతీస్తుంది. దీంతో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా.. ఆరోగ్యంగా ఉండాలంటే 7 నుంచి 8 గంటల నిద్ర అవసరం.

బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. వీటిలో అధిక రక్తపోటు.. అధిక కొలెస్ట్రాల్.. మధుమేహం.. క్రమరహిత హృదయ స్పందన మొదలైనవి ఉన్నాయి. అలాగే కుటుంబంలోని ఎవరికైనా గతంలో బ్రెయిన్ స్ట్రోక్ సమస్య ఉండడం. గమనిక:- ఈ కథనం కేవలం ఆరోగ్య నిపుణుల అభిప్రాయాలు. ఇతర సైట్స్ ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని టీవీ9 తెలుగు దృవీకరించలేదు. సందేహాలకు వైద్యులను సంప్రదించాలి.




