ఈ ఆహారాలు తింటే మీ పని ఖతమే.. పేగుల్లో విషం నింపుతున్నట్లే.. సైలెంట్ కిల్లర్స్ ఏంటో తెలుసుకోండి..

కొన్ని ఆహారాలు, పానీయాలు పేగులకు హాని కలిగించేలా పని చేస్తాయి. పేగుల ఆరోగ్యం క్షీణించినప్పుడు కడుపు ఆరోగ్యం క్షీణిస్తుంది. పేగులకు సైలెంట్ కిల్లర్స్‌గా పరిగణించే ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం

Shaik Madar Saheb

|

Updated on: Dec 12, 2022 | 2:10 PM

శరీరంలోని అన్ని భాగాలు మంచిగా ఉంటేనే మనం ఆరోగ్యవంతంగా ఉంటాం.. అలాంటి వాటిల్లో ప్రేగులు ఒకటి.. మన శరీరంలోని ప్రేగుల విధి ఏమిటంటే ఆహారం నుంచి పోషకాలను వేరు చేసి మిగిలిన శరీరానికి రవాణా చేస్తాయి. పేగుల ఆరోగ్యం చెడిపోతే.. జీర్ణవ్యవస్థ పూర్తిగా ప్రభావితమవుతుంది. కొన్ని ఆహారాలు ప్రేగుల ఆరోగ్యాన్ని దెబ్బతిస్తాయి. ప్రేగులకు నష్టం చేకూరితే.. పలు సమస్యలు తలెత్తడం ఖాయం. ఆ ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
చక్కెర: చక్కెర ఆరోగ్యాన్ని దెబ్బతిస్తుంది. తీపి ఆహారం శరీరంలోని ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను చంపుతుంది. చక్కెర ప్రేగులలో మంటను కలిగిస్తుంది. అందుకే చక్కెర వినియోగానికి ఎంత దూరంగా ఉంటే.. అంత మంచిది అని నిపుణులు పేర్కొంటున్నారు.

2 / 5
మైదా: సాధారణంగా అందరూ మైదాతో చేసిన వస్తువులను రోజూ ఏదో ఒక విధంగా తింటారు. ఇది ఆహారాన్ని రుచిగా మారుస్తుంది. కానీ, మైదా ప్రేగులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని.. విషం కంటే తక్కువ కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో పీచుపదార్థం ఉండదు కావున.. దూరం పెట్టడం మంచిది.

3 / 5
సంతృప్త కొవ్వు: కొవ్వు అధికంగా ఉండే ఆహారాలు ప్రేగులలోని మంచి బ్యాక్టీరియాను చంపుతాయి. పూర్తి క్రీమ్ పాలు లేదా వెన్న తినడానికి రుచికరంగా ఉండవచ్చు.. కానీ వాటి వినియోగం ఆరోగ్యాన్ని క్రమంగా దెబ్బతీస్తుంది.

4 / 5
ఎక్కువ ఫైబర్: ఫైబర్ కడుపు కోసం ఒక వరంగా పరిగణిస్తారు. అయితే ఇది ప్రేగులకు తీవ్ర హాని చేస్తుందని మీకు తెలుసా. ఫైబర్ అధికంగా తీసుకున్నా కూడా శరీరం దెబ్బతింటుందని పేర్కొంటున్నారు.

5 / 5
Follow us