- Telugu News Photo Gallery These are the zodiac signs that will buy a new house due to the influence of Jupiter
లక్కు వీరిదే.. ఈ రాశుల వారు కొత్త ఇల్లు కొనడం ఖాయం.. మీ రాశి ఉందా మరి?
గురువు శుభస్థానంలో ఉంటే ఏ పనులు చేసినా కలిసి వస్తుంది. ముఖ్యంగా కొత్తగా ఇల్లు నిర్మించుకునే వారైనా, స్థిరాస్తి కొనుగోలు చేయాలి అనుకునే వారికి తప్పకుండా గురు బలం ఉండాలని చెబుతారు పండితులు. అయితే ఇప్పుడు గురు అనుగ్రహంతో నాలుగు రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు చేకూరనున్నాయంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?
Updated on: Sep 11, 2025 | 12:38 PM

జ్యోతిష్య శాస్త్రంలో శక్తివంతమైన గ్రహాల్లో గురు గ్రహం ఒకటి. ఇది ప్రతి వ్యక్తి జాతకాన్ని ప్రభావితం చేస్తుంది. అంతే కాకుండా ఈ గ్రహం జీవితంలో శ్రేయస్సు, ఆనందం, శాంతిని పెంపుదించడమే కాకుండా, అనుకున్న పనులన్నీ సకాలంలో జరిగిపోయేలా చేస్తుంది. అయితే గురు సంచారంతో నాలుగు రాశుల వారికి గురు బలం రెట్టింపు కానున్నదంట. దీంతో వారు స్థిరాస్తి, కొత్త ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉందంటున్నారు పండితులు. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

తుల రాశి : తుల రాశి వారికి గురు బలం అధికంగా ఉండటం వలన ఏ పని చేసినా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఎవరైతే కొత్తగా ఇల్లు నిర్మించుకోవాలి అనుకుంటున్నారో వారి కోరిక నెరవేరుతుందని, స్థిరాస్తి కూడా కొనుగోలు చేసే ఛాన్స్ ఉన్నదని చెబుతున్నారు పండితులు.

ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి గురు గ్రహ సంచారంతో అద్భుతంగా ఉండబోతుంది. ఈ రాశి వారు మంచి కంపెనీలో ఉద్యోగం సాధిస్తారు. ఎవరైతే చాలా రోజుల నుంచి స్థిరాస్తి కొనుగోలు చేయాలి చూస్తున్నారో వారి కోరిక నేరవేరే ఛాన్స్ ఉన్నదంట. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. సంతోషంగా గడుపుతారు.

మిథున రాశి : మిథున రాశి వారికి గురు అనుగ్రహంతో ఏ పని మొదలు పెట్టినా కలిసి వస్తుంది. వ్యాపరస్తులకు పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. ఎవరైతే చాలా రోజుల నుంచి వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటారో, వారు కొత్త వ్యాపార ప్రారంభానికి ఇది మంచి సమయం. అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అద్భుతంగా ఉంటుంది.

కర్కాటక రాశి : ఈ రాశి వారికి గురు బలం వలన ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగంలో ఉన్నవారికి అవకాశాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు ఉంటాయి. మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. విద్యార్థులకు ,రియలెస్టేట్ రంగంలో ఉన్నవారికి కలిసి వస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.



