- Telugu News Photo Gallery White Vs Pink Guava: Which One Is Healthier, You Need To Know These Things
Health Tips: తెల్ల జామ – ఎర్ర జామ.. ఆరోగ్యానికి ఏది మంచిది..? తప్పక తెలుసుకోండి..
మనకి అందుబాటులో ఉండే చవకైన, ఆరోగ్యకరమైన పండ్లలో జామ ఒకటి. ఇది పోషకాల నిధి. విటమిన్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఈ పండు, తెల్ల, పింక్ రంగుల్లో లభిస్తుంది. అయితే ఈ రెండు రకాల జామల్లో కొన్ని తేడాలు ఉన్నాయి. ఏ రకం జామ ఎలాంటి వారికి మంచిదో ఇక్కడ చూద్దాం.
Updated on: Sep 11, 2025 | 12:16 PM

తెల్ల జామకాయ సాధారణంగా లేత ఆకుపచ్చ నుండి పసుపు రంగులో ఉంటుంది. లోపల తెల్లని గుజ్జుతో, గింజలు ఎక్కువగా ఉంటాయి. వీటి రుచి కాస్త వగరుగా, తీపిగా ఉంటుంది. విటమిన్ C, డైటరీ ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఇందులో అధికం. సాధారణంగా వీటిని జెల్లీ, జామ్ తయారీకి ఉపయోగిస్తారు.

పింక్ జామకాయ లోపల గులాబీ రంగు గుజ్జు ఉంటుంది. వీటిలో విటమిన్ Cతో పాటు లైకోపీన్ అనే యాంటీఆక్సిడెంట్ అధికంగా ఉంటుంది. ఇది టమాటాలో ఉండే దాని కంటే కూడా ఎక్కువ. లైకోపీన్ క్యాన్సర్ నిరోధక లక్షణాలకు ప్రసిద్ధి. పింక్ జామ రుచి చాలా తీపిగా, సువాసన ఘాటుగా ఉంటుంది. వీటిలో గింజలు తక్కువ, కండ ఎక్కువగా ఉండటం వల్ల జ్యూస్‌లు, స్మూతీలు, సలాడ్‌లకు ఇది బెస్ట్ ఆప్షన్.

బరువు తగ్గాలనుకునే వారు జామపండు తినవచ్చు. ఎందుకంటే ఇందులో కేలరీలు తక్కువగా, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది అదనపు కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తుంది. మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. జామలోని ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడతాయి. జామలోని విటమిన్ సి ఇతర యాంటీఆక్సిడెంట్లు శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

రక్తంలో చక్కెరను తగ్గించే మందులు తీసుకుంటుంటే జామకాయను తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. ఏదైనా శస్త్రచికిత్స తర్వాత వెంటనే జామ పండ్లు తినకూడదు. ఎందుకంటే జామ తినడం వల్ల రక్తస్రావం ప్రమాదం పెరుగుతుంది. దీంతో గాయం మానడం ఆలస్యం అవుతుంది.

ఫైబర్ మంచి జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. ఇది ప్రేగును శుభ్రపరిచే ప్రక్రియను సులభతరం చేస్తుంది. అయితే, జీర్ణక్రియ చాలా తక్కువగా ఉన్నవారు దీనిని ఎక్కువగా తీసుకోవడం మానుకోవాలి. ఇది సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది.




