నాగసర్పదోషంతో బాధపడుతున్నారా..తప్పక వెళ్లాల్సిన గుడి ఇదే!
చాలా మంది నాగసర్ప దోషం, కుజ దోషాలతో బాధపడుతుంటారు. దీని వలన అనేక సమస్యలు ఎదుర్కొంటారు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులు పడతారు. అయితే నాగసర్పదోషంతో బాధపడే వారు ఈ ఆలయానికి వెళితే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు అంటున్నారు పండితులు. కాగా, ఇప్పుడు దాని గురించే వివరంగా తెలుసుకుందాం.
Updated on: Sep 11, 2025 | 12:07 PM

ఫేమస్ టెంపుల్స్‌లో కర్ణాటక రాష్ట్రంలో ఉన్న కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం కూడా ఒకటి. ఇది పశ్చిమ కనుమలలో దక్షిణ కర్నాటక జిల్లా, కుమారగిరి ప్రాంతం దట్టమైన అడవుల మధ్య ధార నది తీరనా సుబ్రమణ్య స్వామి వెలిశారు. ఇక్కడికి నిత్యం ఎంతో మంది భక్తులు వచ్చిపోతుంటారంట. విశేష ప్రాముఖ్యత గలిగిన ఈ ఆలయానికి చాలా ప్రాముఖ్య ఉంటుందంట.

ఇక్కడ సుబ్రమణ్యేశ్వర స్వామి విగ్రహం పడగ విప్పు కాపు కాస్తున్న ఆరు సర్పాల కాల నాలుగు వలె ఉంటుందంట. అందువలన ఇక్కడి వెళ్లిన వారికి శుభం జరగడమే కాకుండా, కాలసర్ప దోషం వంటివి ఉన్నా కూడా అవి తొలిగిపోతాయంట.

కుక్కే గ్రామం మధ్యలో ఒక ప్రాచీన ఆలయం ఉంటుందంట. స్వామి వారిని దర్శించుకోవడానికి ముందు ప్రతి ఒక్కరూ, ఆలయాన్ని సందర్శించి, పవిత్ర ధార నదిలో స్నానం చేసి, ఆలయం వెనుక తలుపుల నుంచి భక్తులు గుడిలో వెళ్లి మూల విరాట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తారంట. తర్వాత గరుడ స్తంభం తర్వాత సుబ్రమణ్య స్వామి మందిరాలు, ఎత్తైన పీఠం, వాసుకిల విగ్రహాలు ఉంటాయంట.

ఈ ఆలయంలో రోజూ నిత్య పూజలు జరుగుతుంటాయి. అలాగే వాటితో పాటు కాల సర్ప దోష పూజలలో ఆశ్లేషబలి, సర్ప సంస్కారలు ముఖ్యమైనవని చెబుతున్నారు పండితులు. కుక్కే సుబ్రమణ్య స్వామి వారి ఆలయంలోకి వెళ్లి ఈ పూజలు జరిపించుకుంటే నాగ దోషం, కాలసర్ప దోషం, కుజ దోషం నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం.

పురాణాల ప్రకారం షణ్ముఖుడు తారకాసుర, పద్మాసుర అను రాక్షసులను సంహరించి, సోదరుడు వినాయకుడితో వచ్చి కుమార పర్వాతాన్ని చేరుకుంటాడు. అప్పుడు రాక్షస సంహారం వలన సంతోషించిన ఇంద్రుడు తన కుమార్తె దేవసేనను ఇచ్చి వివాహం జరిపిస్తాడంట



