- Telugu News Photo Gallery These are the tips to reduce migraine headache, Check Here is Details in Telugu
Migraine: ఇలా చేశారంటే.. మైగ్రేషన్ తలనొప్పిని ఇలా తగ్గించుకోవచ్చు..
తలనొప్పిలో మైగ్రేన్ కూడా ఒకటి. ప్రస్తుత కాలంలో మైగ్రేన్‌తో బాధపడే వారి సంఖ్య బాగా పెరుగుతుంది. మైగ్రేన్ తలొనొప్పి తలలో ఒక వైపు మాత్రమే విపరీతంగా వస్తుంది. ఈ నొప్పిని తట్టుకోవడం చాలా కష్టం. సాధారణ తల నొప్పి కంటే రెండు రెట్లు ఈ నొప్పి వస్తుంది. మైగ్రేన్ తల నొప్పిని తట్టుకోలేక చాలా మంది ట్యాబ్లెట్స్ ఖచ్చితంగా ఉపయోగిస్తారు. కానీ మందులు లేకుండా కూడా మైగ్రేన్ తల నొప్పిని కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ తలనొప్పి..
Updated on: Aug 07, 2024 | 5:29 PM

తలనొప్పిలో మైగ్రేన్ కూడా ఒకటి. ప్రస్తుత కాలంలో మైగ్రేన్‌తో బాధపడే వారి సంఖ్య బాగా పెరుగుతుంది. మైగ్రేన్ తలనొప్పి తలలో ఒక వైపు మాత్రమే విపరీతంగా వస్తుంది. ఈ నొప్పిని తట్టుకోవడం చాలా కష్టం. సాధారణ తల నొప్పి కంటే రెండు రెట్లు ఈ నొప్పి వస్తుంది.

మైగ్రేన్ తల నొప్పిని తట్టుకోలేక చాలా మంది ట్యాబ్లెట్స్ ఖచ్చితంగా ఉపయోగిస్తారు. కానీ మందులు లేకుండా కూడా మైగ్రేన్ తలనొప్పిని కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ తలనొప్పి వచ్చిందంటే ఏ పనీ చేయలేం.

తినే ఆహారానికి మైగ్రేన్ తలనొప్పికి కూడా మధ్య సంబంధం ఉంటుంది. మైగ్రేన్ తలనొప్పి రాకుండా ఉండాలంటే సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. మైగ్రేన్‌తో బాధ పడేవారు పాల ఉత్పత్తులు, గుడ్లు, పుల్లటి పదార్థాలు, గ్లూటెన్ కలిగిన ఆహారాలు తీసుకోకూడదు.

హార్మోన్ల ఇన్ బ్యాలెన్స్ కూడా మైగ్రేన్‌కు కారణం కావచ్చు. మహిళలకు అత్యధికంగా తలనొప్పి రావడానికి హార్మోన్లు కూడా కారణం కావచ్చు. శరీరంలో మెగ్నీషియం లోపం ఉన్నా కూడా తలనొప్పి, మైగ్రేన్ సమస్యకు కారణం కావచ్చు. కాబట్టి మైగ్రేన్‌తో బాధ పడేవారు మెగ్నీషియం ఉండే ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి.

అదే విధంగా నిద్రలేమి సమస్యలతో బాధ పడే వారు కూడా మైగ్రేన్ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. మొదటి సారి మైగ్రేన్ తలనొప్పి వచ్చిన వారు మీ ఆహారంలో ప్రోబయోటిక్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం. ఇలా మందులు అవసరం లేకుండానే మైగ్రేన్ తగ్గించుకోవచ్చు.




