రాహువు అనుగ్రహం .. ఈ రాశుల వారు నక్కతోక తొక్కినట్లే!
జ్యోతిష్య శాస్త్రంలో రాహువు గ్రహం చాలా శక్తివంతమైనది. రాహువు ఒక వ్యక్తి జీవితంపై చాలా ప్రభావం చూపిస్తుంది. ఇది మంచి స్థానంలో ఉంటే కలిసి రావడం, రాహువు చెడు స్థానంలో ఉంటే ఆ వ్యక్తి జీవితం చాలా సమస్యలతో కూడి ఉంటుందిని చెబుతుంటారు పండితులు. అయితే కొన్ని రాశులపై రాహువు అనుగ్రహం చూపుతున్నాడంట. అవి ఏవి అంటే?
Updated on: Jul 04, 2025 | 9:14 PM

రాహువు గ్రహల్లో ఉన్నస్థితిని బట్టి దాని ప్రభావం 12 రాశులపై ఉంటుంది. అంతే కాకుండా రాహువు మంచి స్థానంలో ఉంటే అనేక శుభాలు జరుగుతాయి. కానీ రాహువు చెడు దృష్టిపడితే మాత్రం వారి జీవితం నరకపాయంగా ఉంటుంది. అలాగే రాహువు అనుగ్రహం కలిగితే వారి పంట పండినట్లే అంటారు. అయితే 12 రాశుల్లో మూడు రాశులంటే రాహువుకు చాలా ఇష్టం అంట.

సింహ రాశి : సింహరాశి వారి పై రాహువు గ్రహం చల్లని చూపు ఉన్నదంట. అంతే కాకుండా రాహువుకు ఇష్టమైన గ్రహాల్లో ఈ రాశి ఒకటి. అందువలన వీరికి రాహువు అనుగ్రహం వలన ఏ పని చేసినా కలిసి వస్తుందంట. పట్టిందల్లా బంగారమే కానున్నదంట. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వీరు కోరుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి.

అలాగే చాలా రోజులుగా ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో, వారు త్వరలో జాబ్ కొట్టే ఛాన్స్ ఉంటుంది. వీరి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. పెళ్లి కాని వారికి వివాహం కుదురుతుంది. అలాగే, భార్యభర్తల మధ్య సమస్యలు తొలిగిపోతాయి.

వృశ్చిక రాశి : ఈ రాశి వారికి రాహువు అనుగ్రహం వలన అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. వీరు ఎంత కష్టతరమైన పనులైనా సరే రాహువు అనుగ్రహంతో చాలా త్వరగా పూర్తి చేస్తారు. ఎప్పుడూ చాలా ఆనందంగా ఉంటారు. గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఎలాంటి అనారోగ్యసమస్యలు దరి చేరవు, పట్టిందల్లా బంగారమే కానున్నదంట.

వృషభ రాశి : వృషభ రాశి వారికి రాహు గ్రహం అనుగ్రహం వలన మంచి ఉద్యోగంలో చేరుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. విద్యార్థులకు, వ్యాపారస్తులకు, కళారంగంలో ఉన్నవారికి అద్భుతంగా ఉంటుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.



















