- Telugu News Photo Gallery These are the things that should not be kept in the house according to Vastu Shastra
వాస్తు టిప్స్ : ఇంట్లో ఈ ఐదు వస్తువులు అస్సలే ఉండకూదంట!
వాస్తు శాస్రాం ప్రకారం ఇంటిలో ఈ ఐదు రకాల వస్తువులు అస్సలే ఉండకూడదు అని చెబుతున్నారు పండితులు. ఇవి ఇంటిలో ఉండటం వలన అనారోగ్య సమస్యలే కాకుండా, కెరీర్ డెవలప్ మెంట్‌కు అవి ఆటంకం కలిగిస్తాయంట. కాగా, ఇంటిలోపల ఎలాంటి వస్తువులు ఉండకూడదో ఇప్పుడు చూద్దాం.
Updated on: Jul 27, 2025 | 7:20 PM

వాస్తు శాస్త్ర ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రం గురించి కూడా తెలియజేయడం జరిగింది. ఇక వాస్తు నియమాలను ఏ ఇంటివారైతే పాటిస్తారో, ఆ ఇంట్లో సంతోషకర వాతావరణం ఉంటుంది. ఎవరైతే వాస్తు నియమాలు ఉల్లంఘిస్తారో వారికి కష్ట, నష్టాలు తప్పవు అని చెబుతున్నారు పండితులు.

అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఆనందకర వాతావరణం నెలకొనాలంట, ఈ ఐదు వస్తువులు అస్సలే ఉండకూడదంట. అవి ఏవి అంటే? పాత వార్తా పత్రికలు.ఇంట్లో పాత వార్తపత్రికలు ఉండటం వలన అవి ప్రతికూల శక్తి కలిగిస్తాయంట. అంతే కాకుండా కొన్ని సార్లు దురదృష్టాన్ని కూడా తీసుకొస్తాయంటున్నారు పండితులు.

అదే విధంగా ఇంట్లో ఆగిపోయిన గడియారం కూడా అస్సలే ఉండకూడదంట. దీని వలన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుందని చెప్తున్నారు పండితులు. ఆగిపోయిన గడియారం ఇంట్లో ఉంచుకోవడం వలన అశుభం కలుగుతుందని, దీని వలన ఆర్థిక సమస్యలు వస్తాయని వారు చెబుతున్నారు.

అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో చిరిగిన బట్టలు లేదా, వాడనివి, చాలా రోజుల క్రితంవి ఉండకూడదంట. ఇవే కాకుండా పాడైపోయిన పాత్రలు కూడా ఇంట్లో ఉంచుకోవడం శ్రేయస్కరం కాదు, వీటివలన ఇంట్లో సంతోషం దెబ్బతింటుంది. అశాంతి నెలకొంటుంది. అందుకే వీటిని ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఉంచుకోకూడదని చెబుతున్నారు పండితులు.

అలాగే కొంత మంది ఇంటిలో చనిపోయిన వారి దుస్తులు లేదా వారు వాడిన వస్తువులను ఉంచుకుంటారు. కానీ ఇది కూడా అంత మంచిది కాదని, దీని వలన అనేక సమస్యలు వస్తాయని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.



