AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీ ఎక్కువగా తాగుతున్నారా.. అయితే ఈ రోగాలు తప్పవంట!

టీ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. చాలా మంది ఎంతో ఇష్టంగా టీ తాగుతుంటారు. మరీ ముఖ్యంగా ఆఫీసుల్లో పని చేసే వారు రోజుకు రెండు లేదా మూడు సార్లు టీ తాగుతుంటారు. అయితే నిపుణులు మాత్రం ఎక్కువగా టీ తాగకూడదని చెబుతుంటారు. కాగా, అసలు టీ ఎన్ని సార్లు తాగం మంచిది? టీ ఎక్కువగా తాగితే ఎలాంటి సమస్యలు వస్తాయో చూద్దాం.

Samatha J
|

Updated on: Jul 14, 2025 | 4:23 PM

Share
ఉదయం అయ్యిందంటే చాలు చాలా మంది టీ తాగడానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు. కొంత మంది అయితే టీ తాగనిదే రోజుగడవ నట్లు ఉంటుందని చెబుతుంటారు. ఇంకొందరు తప్పకుండా ప్రతి రోజూ ఉదయం కప్పు కాఫీతాగినిదే తల నొప్పిగా ఉంటుందంటారు. అలా చాలా మంది టీకి అలవాటు పడిపోయారు. అయితే టీ తాగడం మంచిదే అయినప్పటికీ అతిగా తాగడం వలన అనేక రకాలైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉన్నదంట.

1 / 5
ప్రస్తుతం వర్షకాలం. ఈ సీజన్‌లో ఎక్కువ తేమగా ఉంటుంది. అంతే కాకుండా వాతావరణం కూడా చాలా చల్లగా ఉండటంతో చాలా మంది ఎక్కువగా టీ తాగడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కానీ టీ ఎక్కువగా తాగకూడదంట. కనీసం రోజుకు రెండు లేదా మూడు కప్పుల టీ తాగడం ఆరోగ్యానికి ప్రమాదకరం కాదు, కానీ అంతకు మించి తాగడం వలన ఐరన్ లోపం, నిద్రలేమి, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయంట.

2 / 5
అదే విధంగా ఎక్కువగా టీ తాగడం వలన కొందరిలో తల తిరగం, రక్తపోటు పెరగడం వంటి సమస్యలు ఎక్కువవుతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. కొందరు ఎక్కవ మోతాదులో బ్లాక్ టీ లేదా టీ తీసుకుంటుంటారు. కానీ దీని వలన ఇది గుండెపై తీవ్ర ప్రభావం చూపుతుందంట. అధికంగా టీ తాగడం వలన కొన్ని సార్లు ఇది శరీరంలోని అనేక సమస్యలకు కారణం అవుతుంది. మరీ ముఖ్యంగా చేతులు వణకడం, ఆందోళన వంటి సమస్యలు తలెత్తుతాయంట.

3 / 5
అంతే కాకుండా పరగడుపున టీ తాగడం వలన ఇది జీర్ణక్రియ సమస్యలను తీసుకొస్తుంది.అలాగే  టీ అధికంగా తాగడం వలన ఎముకలు బలహీన పడుతాయంట. టీ అధికంగా తాగితే కాల్షియ లోపం ఏర్పడుతుందంట. దీని వలన ఎముకలు బలహీన పడటమే కాకుండా ఎముకలు విరిగే ప్రమాదం కూడా లేకపోలేదంటున్నారు నిపుణులు.

4 / 5
అలాగే ఎక్కువగా టీ తాగడం వలన ఆందోళన పెరగడం, గుండె వేగంగా కొట్టుకోవడం, రక్త పోటు పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయంట. అంతే కొంత మంది బరువు తగ్గిపోతారంట. అందువలన వీలైనంత వరకు టీని తక్కువ మొతాదులో తీసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

5 / 5