- Telugu News Photo Gallery These are the four zodiac signs that will be lucky due to Budhaditya Raja Yoga
బుధాదిత్య రాజయోగం : ఈ రాశుల వారి జీవితం అద్భుతం!
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు రాశులను మార్చుకోవడం అనేది సహజం. నెలకు ఒకసారి లేదా ఆరు నెలలు సంవత్సరానికి ఒకసారి గ్రహాలు తమ రాశులను లేదా నక్షత్రాలను మార్చుకుంటాయి. ఈ గ్రహాల సంచారం లేదా కలయిక వలన కొన్ని రకాల రాజయోగాలు ఏర్పడుతుంటాయి. అయితే జూలై నెలలో బుధాదిత్య రాజయోగం ఏర్పడ నుంది. దీని వలన కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందంట.
Updated on: Jul 05, 2025 | 9:32 PM

జూలై నెలలో శక్తివంతమైన గ్రహాలు, బుధుడు, సూర్యు గ్రహాల కలియక జరగనుంది. దీని కారణంగా నాలుగు రాశుల వారికి అనుకోని విధంగా ప్రయోజనాలు చేకూరనున్నాయి. కాగా, ఆ రాశులు ఏవో, వారి ఏ విధమైన లాభాలు చేకూరుతాయో ఇప్పుడు చూద్దాం.

ధనస్సు : ధనస్సు రాశి వారికి బుధాదిత్య రాజయోగం వలన అద్భతంగా ఉంటుంది. వీరు ఏపని చేసినా కలిసి వస్తుంది. విద్యార్థులకు, వ్యాపారస్తులు ఎలాంటి సమస్యలు లేకుండా తమ పనులను పూర్తి చేసుకుంటారు. ఆర్థికంగా ఆరోగ్య పరంగా వీరికి కలిసి వస్తుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.

కుంభ :కుంభరాశి వారికి బుధాదిత్య రాజయోగం వలన ఆర్థికంగా బాగుంటుంది. వీరికి రావాల్సిన డబ్బు చేతికందుతుంది. ఆస్తులు పెరుగుతాయి. ఉద్యోగం చేసే వారు ప్రమోషన్స్ అందుకునే ఛాన్స్ ఉంది. విద్యార్థులు మంచి ర్యాంకులు పొందుతారు. అన్నింటా శుభ ఫలితాలు కలుగుతాయి.

తుల :బుధాదిత్య రాజయోగం తుల రాశి వారిపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. దీని వలన ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో కలిసి వస్తుంది. రియలెస్టేట్ రంగంలో ఉన్న వారు అద్భుతమైన ప్రయోజనాలు అందుకుంటారు. చాలా రోజుల నుంచి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారు ఉద్యోగంలో చేరి చాలా ఆనందంగా గడుపుతారు.

వృశ్చిక :జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, బుధాదిత్య రాజయోగం చాలా శక్తి వంతమైనది. కాగా, ఈ రాజయోగం వృశ్చిక రాశి వారికి అద్భుత ప్రయోజనాలను అందిస్తుంది. దీని వలన ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. అంతే కాకుండా సంపద రెట్టింపు అవుతుంది. డబ్బుకు లోటే ఉండదు. ఇంటా బయట ఆనందకర వాతావరణం చోటు చేసుకుంటుంది.



















