Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెరుగుతో పాటు అస్సలే తినకూడని ఆహారపదార్థాలు ఇవే.. తింటే అంతే ఇక!

మన శరీరానికి చల్లదనాన్ని ఇచ్చేది పెరుగు. అందుకే చాలా మంది వేసవిలో పెరుగు తినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. మరీ ముఖ్యంగా వేసవి కాలంలో తప్పని సరిగా పెరుగు ఉండాల్సింది. కొంత మంది సీజన్‌తో పని లేకుండా ఎంతో ఇష్టంగా పెరుగు తింటుంటారు. కనీసం భోజనం చివరలో అయినా సరే ఒక ముద్దు పెరుగు తినడానికి ఇష్టపడుతారు. అయితే పెరుగు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదే అయినప్పటికీ, పెరుగుతో పాటు కొన్ని రకాల ఆహారపదార్థాలు అస్సలే తీసుకోకూడదంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Jul 04, 2025 | 8:38 PM

Share
 చేపలకర్రీ, చేపల ఫ్రై తినడం చాలా మందికి ఇష్టం. అయితే ఫిష్ కర్రీ తిన్నప్పుడు అస్సలే పెరుగు తినకూడదంట. ఎందుకంటే? చేపలు శరీరంలో వేడిని పెంచుతాయి. పెరుగు శరీరానికి చలవనిస్తుంది. అయితే ఈ రెండు కలిపి తీసుకోవడం వలన ఇది జీర్ణక్రియపై తీవ్ర ప్రభావం చూపిస్తుందంట. మరీ ముఖ్యంగా అధిక బరువుకు కూడా కారణం కావచ్చు, కొన్నిసార్లు ఇది మలబద్ధకం వంటి సమస్యలను తీవ్రతరం చేస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

1 / 5
అదే విధంగా పెరుగుతో పాటు కొన్ని రకాల పండ్లు అస్సలే తీసుకోకూడదంట. పెరుగు అనేది జీర్ణం కావడానికి చాలా సమయం తీసుకుంటుంది. కానీ పండ్లు మాత్రం త్వరగా జీర్ణం అవుతాయి. అందువలన పండ్లు, పెరుగు రెండింటిని కలిపి తీసుకుంటే ఇది గ్యాస్ లేదా ఉబ్బరం వంటి సమస్యలకు దారి తీసుకుంది. ఇంకొంత మంది పెరుగుతో పాటు అరటి పండు తినడానికి ఎక్కువ మక్కువ చూపిస్తారు కానీ దీని వలన కఫసంబంధమైన సమస్యలు వస్తాయంట.

2 / 5
పాలు, పెరుగు రెండూ పాల ఉత్పత్తులే అయినప్పటికీ ఈ రెండింటిని ఎట్టిపరిస్థితుల్లో కలిపి తీసుకోకూడదంట. ఎందుకంటే పాలు కాస్త తియ్యగా ఉంటాయి. ఇక పెరుగు పుల్లగా ఉంటుంది. అయితే ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వలన ఇది వికారం, గ్యాస్, వంటి సమస్యలే కాకుండా కడపునొప్పి వంటి సమస్యలను కూడా తీసుకొస్తుందంట. అందుకే పాలు,పెరుగు కలిపి ఎప్పుడూ తీసుకోకూడదంట.

3 / 5
పెరుగు, మినప్పు వడలు చాలా మంది వీటిని లొట్టలేసుకొని తింటారు. కానీ ఇలా తినడం ఆరోగ్యానికి హానికరం. మినపప్పు అనేది చాలా ఆలస్యంగా జీర్ణం అవుతుంది. పెరుగు కూడా ఆలస్యంగా జీర్ణం అయినప్పటికీ మినపప్పుతో పోలీస్తే ఇది కాస్త త్వరగా అవుతుంది. అయితే ఈ రెండు కలిపి తీసుకోవడం వలన జీర్ణక్రియ సక్రమంగా సాగదంట. దీని వలన కడుపులో బరువు, ఇబ్బందిగా అనిపిస్తుందంట.

4 / 5
చాలా మంది ఉల్లిపాయ, పెరుగు కలిపి తీసుకుంటారు. మరీ ముఖ్యంగా వేసవిలో పెరగు అన్నం తింటూ ఉల్లిపాయను నంచుకుంటారు. కానీ ఈ రెండు కలిపి తీసుకోకూడదంట. ఎందుకంటే పెరుగు కాస్త పుల్లగా ఉంటుంది. అదే విధంగా ఉల్లిపాయ ఘాటుగా ఉంటుంది. వీటిని కలిపి తీసుకోవడం వలన శరీరంలో శక్తి నసిస్తుందంట.(పై సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వబడినది. టీవీ9 తెలుగు దీనిని ధ‌ృవీకరించలేదు.)

5 / 5