డబ్బు వచ్చిన వెంటనే ఖర్చు అయిపోతుందా.. ఈ టిప్స్ మీ కోసమే!
కొంత మంది ఇంటిలో డబ్బు అస్సలే నిలవదు. వారు ఎంత సంపాదించినా, వెంట వెంటనే మనీ ఖర్చు అయిపోతుంటుంది. అయితే ఇలా ఇంట్లో డబ్బులు నిల్వకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. కాగా, అసలు ఇంట్లో ఎందుకు డబ్బు నిల్వదో ఇప్పుడు మనం చూద్దాం.
Updated on: Aug 31, 2025 | 6:48 PM

చాలా మంది ఎదర్కొనే సమస్యల్లో డబ్బు వస్తుంది కానీ అది ఉండటం లేదు. ప్రతి రోజూ మేము ఆర్థిక సంక్షోభం ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతుంటారు. అయితే ఇలా ఇంట్లో ఆర్థిక సంక్షోభంతో సతమతం అయ్యే వారు కొన్ని వస్తువులను ఇంటిలోపల పెట్టుకోవడం వలన వాటి నుంచి భయపడే ఛాన్స్ ఉందంట. కాగా ఇంటిలోపల ఎలాంటి వస్తువులు పెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం.

ఇంటిలో తాబేలు విగ్రహం లేదా తాబేలు పెట్టుకోవడం వలన ఆర్థికంగా కలిసి వస్తుందంట. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటిలోపల లోహపు తాబేలు ఉంచుకోవడం వలన ఆర్థిక సమస్యలు తగ్గిపోయి సంపద పెరుగుతుందంట. ఎందుకంటే? తాబేలు విష్ణువు అవతారం, అయితే ఇంటిలోపల ఈ విగ్రహం పెట్టుకోవడం వలన విష్ణు అనుగ్రహం వలన సంపద తరగదంట.

అదే విధంగా ఇంటిలోప క్రిస్టల్ పిరమిడ్ ఉంచుకోవడం చాలా శుభ ప్రదం అంట. దీని వలన ఆర్థికంగా, ఆరోగ్య పరంగా, వృద్ధిపరంగా కలిసివస్తుందంట. ముఖ్యంగా ఈ పిరమిడ్‌ను కుటుంబ సభ్యులు ఏ ప్రదేశంలో అయితే ఎక్కువ సమయం గడుపుతారో, ఆ ప్రదేశంలో ఈ విగ్రహం పెట్టాలంట. దీని వలన ఇంట్లో ప్రతి సభ్యుడి ఆదాయం పెరిగి, ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయంట.

ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలి అంటే, సాధారణ కొబ్బరికాయ కంటే చాలా చిన్న కొబ్బరికాయను ఇంటిలో పెట్టుకోవడం వలన ఆర్థికంగా కలిసి వస్తుందంట. ఇలాంటి కొబ్బరికాయ ఎవరి ఇంటిలో పెడుతారో, వారి ఇంట్లో ఎప్పుడూ ఆహారానికి, డబ్బుకు కొరత ఉండదు అని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

అలాగే ఎవరు అయితే ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకుంటూ, నిత్యం ధూప దీపారాధన చేస్తారో అలాంటి వారి ఇంటిలోపల సంపదకు లోటు ఉండదంట. అందుకే ఆర్థిక సమస్యలతో బాధపడే వారు క్రమం తప్పకుండా దీపారాధన చేస్తూ, ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలంట. దీని వలన ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయంట.



