AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రతి రోజూ ఉదయం మెంతి నీరు తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ప్రతి ఒక్కరి ఇంట్లోని వంట గదిలో ఉండే పోపు గింజల్లో మెంతి గింజలు ఒకటి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే వీటి గింజలను నీళ్లలో నానబెట్టి ఆ నీరు ప్రతి రోజూ ఉదయం తాగడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయంట. కాగా, అవి ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

Samatha J
| Edited By: Ravi Kiran|

Updated on: Jun 29, 2025 | 7:00 AM

Share
జుట్టు పెరుగుదలకు మెంతి నీరు చాలా మంచిది. ఎందుకంటే? మెంతుల్లో ప్రోటీన్, నికోటినిక్  వంటివి ఎక్కువ మోతాదులో ఉంటాయి. అందువలన ఇవి జుట్టు మూలాలను బలోపేతం చేసి, జుట్టు రాలడాన్ని నివారించడానికి సహాయపడతాయి. అంతే కాకుండా జుట్టు తెల్లబడంటం,  చుండ్రు, దురద వంటి సమస్యలను కూడా తగ్గించగలంట. అందుకే జుట్టు సమస్యలతో బాధ పడే వారు ఈ నీరు తాగడం మంచి ఎంపిక.

1 / 5
 మెంతి నీరు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. వీటిలో గెలాక్టోమన్నన్ వంటి కరిగే ఫైబర్ ఉంటుంది, ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. . అందుకే డయాబెటీస్ సమస్యతో బాధపడే వారు తమ డైట్‌లో మెంతి నీరు చేర్చుకోవడం చాలా మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

2 / 5
అలాగే బరువు తగ్గాలి అనుకునే వారు తమ రోజును మొంతి నీటితో ప్రారంభించడం వలన సులభంగా బరువు తగ్గవచ్చునంట. ఇందులో అధిక ఫైబర్ ఉంటుంది. అందువలన ఇది కడుపు నిండిన అనుభూతిని కలిగించడమే కాకుండా జీవక్రియ సాఫీగా సాగేలా చేసి, శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను కరిగించడంలో సహాయపడుతుందంట. తద్వారా త్వరగా బరువు తగ్గ వచ్చును.

3 / 5
మెంతులలోని కరిగే ఫైబర్ జీర్ణవ్యవస్థకు ఒక ఏజెంట్ లాగా పనిచేస్తుంది. మెంతి నీటిని తాగడం వల్ల మీ జీర్ణక్రియ సాఫీగా సాగిపోయి, అజీర్ణం, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. అందువలన ప్రతి రోజూ మెంతినీరు తీసుకోవడం వలన ఇది మెరుగైన జీర్ణక్రియను ప్రోత్సహించడానికి దోహదపడుతుంది.

4 / 5
మెంతి నీరు ప్రతి రోజూ తాగడం వలన ఇది మహిళలను పీరియడ్స్ నొప్పి నుంచి బయటపడేలా చేస్తుంది. హర్మోన్లను సమతుల్యం చేసి, బురుస్రావం సమయంలో వచ్చే నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అదే విధంగా ఇది అధికరక్తస్రావాన్ని కూడా తగ్గి స్తుంది.

5 / 5