- Telugu News Photo Gallery There are more uses for used tea powder than you would believe, Check Here is Details
Used Tea Powder Uses: వాడిన టీ పొడితో ఇన్ని రకాల ఉపయోగాలో.. అస్సలు నమ్మరు!
ప్రతీ ఇంట్లో దాదాపు అందరూ టీ తాగుతారు. టీతోనే అందరి రోజు మొదలవుతుంది. ఒక్క కప్పు టీ తాగినా ఎంతో రిఫ్రెష్ ఫీల్ అవుతూ ఉంటారు. టీ చేసిన తర్వాత మిగిలిన టీ పొడిని పడేస్తూ ఉంటారు. కానీ ఈ టీ పొడితో ఉండే లాభాలు మాత్రం అన్నీ ఇన్నీ కావు. దీనితో అద్భుతాలు చేయవచ్చు. మిగిలిన టీ పొడిని పడేయకుండా వాటిని మొక్కలకు ఎరువుగా ఉపయోగించుకోవచ్చు. ఈ టీ పొడిని మొక్కల మట్టితో కలిపి వేయడం వల్ల మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి. తమల పాకు, కరివేపాకు..
Updated on: Oct 08, 2024 | 9:43 PM

ప్రతీ ఇంట్లో దాదాపు అందరూ టీ తాగుతారు. టీతోనే అందరి రోజు మొదలవుతుంది. ఒక్క కప్పు టీ తాగినా ఎంతో రిఫ్రెష్ ఫీల్ అవుతూ ఉంటారు. టీ చేసిన తర్వాత మిగిలిన టీ పొడిని పడేస్తూ ఉంటారు. కానీ ఈ టీ పొడితో ఉండే లాభాలు మాత్రం అన్నీ ఇన్నీ కావు. దీనితో అద్భుతాలు చేయవచ్చు.

మిగిలిన టీ పొడిని పడేయకుండా వాటిని మొక్కలకు ఎరువుగా ఉపయోగించుకోవచ్చు. ఈ టీ పొడిని మొక్కల మట్టితో కలిపి వేయడం వల్ల మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి. తమల పాకు, కరివేపాకు మొక్కలకు వేయడం వల్ల ఏపుగా పెరుగుతాయి.

మిగిలిన టీ పొడిని అద్దాలు, గాజు వస్తువులు తుడిచేందుకు కూడా ఉపయోగించుకోవచ్చు. టీ పొడిని ఒక స్ప్రే బాటిల్‌లో వేసి నీటిలో మరిగించండి. ఈ నీటితో ఇంటి ఫ్లోరింగ్, అద్దాలను తుడవచ్చు.

ఈ టీ పొడిని జుట్టుకు కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది జుట్టును ఆరోగ్యంగా మెరిసేలా చేస్తుంది. అంతే కాకుండా మెహందీలో కలిపి రాసుకోవచ్చు. అలాగే ఈ నీటిని మరిగించి.. చల్లారాక జుట్టును కడిగితే మంచి రిజల్ట్స్ ఉంటాయి.

ఇంట్లోకి ఈగలు, దోమలు, పురుగులు, చీమలు వంటి కీటకాలు వస్తూ ఉంటాయి. వీటిని దూరంగా ఉంచేందుకు కూడా టీ పొడి చక్కగా పిన చేస్తుంది. మిగిలిన టీ పొడిని నీటిలో మరిగింది మళ్లీ వడకట్టి.. ఈగలు, కీటకాలు వచ్చే ప్రదేశంలో తుడిస్తే కీటకాలు రాకుండా ఉంటాయి. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)




