మీకు అర్ధమవుతోందా.! ఆ లక్షణం గుండెపోటుకి కారణం కావొచ్చు.. విస్మరించవద్దు..
ప్రపంచవ్యాప్తంగా గుండెపోటు మరణాలు భారీగా పెరుగుతున్నాయి.. భారతదేశంలో కూడా చిన్నా పెద్దా.. అనే తేడా లేకుండా చాలామంది గుండెపోటుకు గురవుతున్నారు.. అయితే.. గుండె కండరాల భాగానికి తగినంత రక్తం అందనప్పుడు, గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. అయితే.. గుండెపోటుకు ముందు శరీరం మనకు కొన్ని సంకేతాలను అందిస్తుంది.. ఆ లక్షణాలను చాలా మంది విస్మరిస్తుంటారు. అలా విస్మరించడం, నిర్లక్ష్యం చేయడం వల్ల సమస్య మరింత జఠిలం అయి.. ప్రాణాలు తీసే ప్రమాదం పెరుగుతుంది. గుండెపోటు అకస్మాత్తుగా వచ్చి.. 2-3 నిమిషాల్లో నొప్పి వేగంగా పెరుగుతుంది. ఈ నొప్పి కుడి, ఎడమ, ఛాతీ మధ్యలో, దవడ లేదా ఎడమ చేతికి వ్యాపిస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
