ఈ రెండు స్మార్ట్ ఫోన్స్‌లోనూ స్నాప్‌డ్రాగన్ 8 జెన్3 ప్రాసెసర్‌ను అందించనున్నారు. షావోమీ 14 ఫోన్‌లో 90 వాట్స్ హైపర్ ఛార్జ్‌కు సపోర్ట్ చేసే 4610 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించనున్నారు. అలాగే 50 వాట్స్ వైర్‌లెస్ హైపర్ ఛార్జ్ టెక్నాలజీని అందించనున్నారు. ఇక షావొమీ 14 అల్ట్రా ఫోన్ విషయానికొస్తే ఇందులో 90 వాట్స్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించనున్నారు. 80 వాట్స్ వైర్‌లైస్ హైపర్ ఛార్జ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. ఇదిలా ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయంపై కంపెనీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.