- Telugu News Photo Gallery Technology photos Whatsapp is testing new feature with that no one can take your DP Screen shot
WhatsApp: మీ వాట్సాప్ డీపీ ఇక సేఫ్.. త్వరలోనే అందుబాటులోకి కొత్త ఫీచర్
Updated on: Feb 25, 2024 | 10:26 PM

సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత యూజర్ల సెక్యూరిటీ సైతం ప్రమాదంలో పడుతోంది. ముఖ్యంగా ప్రొఫైల్ ఫొటోలను మిస్ యూజ్ చేస్తూ కొందరు కేటుగాళ్లు యూజర్లను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి వాట్సాప్ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది.

వాట్సాప్ తాజాగా తీసుకొస్తున్న కొత్త ఫీచర్‌తో ఇకపై ప్రొఫైల్ ఫొటోలను స్క్రీన్ షాట్ తీయడం కుదరదు. ఎవరైనా మీ ప్రొఫైల్ ఫొటో స్క్రీన్‌షాట్ తీయడానికి ప్రయత్నిస్తే, వాట్సాప్ డీపీ బ్లాక్ చేసినట్లుగా చూపిస్తుంది.

ఈ మధ్య కాలంలో వాట్సాప్ డీపీలను ఎడిట్ చేసిన బ్లాక్ మేల్ చేస్తున్న సంఘటనలు తరచూ చూస్తున్నాం. ఫేక్ ఫొటోలతో బెదిరింపులకు పాల్పడటం, వేధించడం వంటి సంఘటనలు చాలా జరిగాయి. ఇలాంటి బెదిరింపులను అరికట్టడానికి ఈ ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు వాట్సాప్ పేర్కొంది.

వాట్సాప్ యూజర్ల అనుమతి లేకుండా ప్రొఫైల్ ఫొటోలను క్యాప్చర్ చేయకుండా, షేర్ చేయకుండా కట్టడి చేయడం ద్వారా వాట్సాప్‌లో యూజర్ల డేటాకు రక్షణ ఉంటుందని అధికారులు తెలిపారు

WabetaInfo నివేదిక ప్రకారం ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారని తెలుస్తోంది. ఆండ్రాయిడ్ వెర్షన్ 2.24.4.25 అప్‌డేట్ కోసం తాజా WhatsApp బీటాలో అందుబాటులో ఉంది.




