- Telugu News Photo Gallery Technology photos Xiaomi launching new charging technology 200 watt charger phone charge within 8 minutes
Xiaomi 200 Watt Charger: మరో సంచలనానికి తెర తీసిన షియోమీ.. కేవలం 8 నిమిషాల్లోనే..
Xiaomi 200 Watt Charger: ప్రపంచ టెక్ మార్కెట్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న షియోమీ. తాజాగా ఛార్జింగ్‌లో విప్లవాత్మక టెక్నాలజీని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా కేవలం 8 నిమిషాల్లోనే ఫుల్ చార్జింగ్ అయ్యే విధంగా...
Updated on: Jun 01, 2021 | 2:21 PM

చైనాకు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజం షియోమీ ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లు, టెక్నాలజీతో ప్రపంచ టెక్ మార్కెట్‌ను ఆకట్టుకుంటోంది.

ఈ క్రమంలోనే మొబైల్ ఛార్జింగ్‌పై దృష్టి సారించిన షియోమీ తాజాగా మరో రెండు కొత్త అద్భుత టెక్నాలజీలను తీసుకొచ్చింది.

ఇందులో ఒకటి.. 200వాట్ హైపర్‌చార్జ్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ కాగా, మరొకటి 120వాట్ వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ.

200వాట్ హైపర్‌చార్జ్ ఫాస్ట్ చార్జింగ్ సహయంతో 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ గల ఫోన్‌ని కేవలం 8 నిమిషాల్లోనే ఫుల్ చార్జ్ కావడం విశేషం.

అలాగే 120వాట్ వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్‌తో అదే సామర్ధ్యం గల బ్యాటరీని కేవలం 15 నిమిషాల్లో ఫుల్ చార్జ్ చేయవచ్చు.

ఇదిలా ఉంటే షియోమీ గతంలో 120వాట్ వైర్డ్, 80వాట్ వైర్‌లెస్ చార్జింగ్ టెక్నాలజీలను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.




