- Telugu News Photo Gallery Technology photos Which country spends most time on social media check out list here
Social Media: సోషల్ మీడియాకు అధిక టైమ్ కేటాయించే టాప్ 5 దేశాలివే.. భారత్ స్థానం ఎంతటే..!
Social Media: సోషల్ మీడియా మనిషి జీవితాన్నే శాసిస్తోందనడం ఎలాంటి సందేహం లేదు. కరోనా వైరస్ మహమ్మారి సమయంలో ప్రపంచ దేశాలు లాక్‌డౌన్ విధించగా.. దాదాపు ప్రజలు సోషల్ మీడియాను విపరీతంగా వాడేశారు. ఇంకా సోషల్ మీడియా కూడా చాలా ఉపయోగపడింది. సమస్త సమాచారాన్ని క్షణాల్లో చేరవేసింది. లాక్ డౌన్ సమయంలో సోషల్ మీడియా వినియోగం కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఈ సంఖ్య 2018 తో పోలిస్తే మూడు శాతం ఎక్కువ. 2018 లో, సగటున ఒక ఇంటర్నెట్ వినియోగదారుడు ఒక రోజులో సోషల్ మీడియాకు 142 నిమిషాలు కేటాయించాడు. ఇప్పుడు మరింత పెరిగింది.
Updated on: Mar 27, 2021 | 8:02 AM

ఇంటర్నెట్ వినియోగదారులు సోషల్ మీడియాను ఎక్కువగా వినియోగించిన దేశాల్లో మొదటి స్థానంలో ఫిలిప్పీన్స్ ఎంది. ఇక్కడ ఇంటర్నెట్ వినియోగదారులు రోజుకు 3 గంటలు 50 నిమిషాలు సోషల్ మీడియాలో గడిపారు.

ఫిలిప్పీన్స్ తరువాత నైజీరియా దేశం ఉంది. ఇక్కడ ఇంటర్నెట్ వినియోగదారులు రోజుకు సగటున 3 గంటలు 42 నిమిషాలు సోషల్ మీడియాలో గడిపారు. అంటే ఫిలిప్పీన్స్ కంటే ఎనిమిది నిమిషాలు తక్కువ.

ప్రపంచంలో సోషల్ మీడియా వాడకం విషయంలో భారతదేశం మూడవ స్థానంలో ఉంది. ఇక్కడ ఇంటర్నెట్ వినియోగదారులు ఒక రోజులో 2 గంటలు 26 నిమిషాలు సోషల్ మీడియాను వినియోగించారు.

అగ్రరాజ్యం అమెరికాలో ఇంటర్నెట్ వినియోగదారులు సగటున 2 గంటల 8 నిమిషాలు సోషల్ మీడియాలతో గడుపుతారు.

ఫేస్‌బుక్, ట్విట్టర్‌లను సెన్సార్ చేసి, సొంతంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించిన చైనా దేశంలోని ఇంటర్నెట్ వినియోగదారులు 1 గంట 57 నిమిషాలు సోషల్ మీడియాలో గడుపుతారట. ఇక చైనాలో సోషల్ మీడియా వాడకంపై చాలా ఆంక్షలు ఉన్న విషయం తెలిసిందే.




