- Telugu News Photo Gallery Technology photos Whatsapp introduces new feature Voice message transcripts, check here for feature uses
WhatsApp: వాట్సాప్‌లో వాయిస్ మెసేజ్ ట్రాన్స్ స్క్రిప్ట్స్ ఫీచర్.. ఉపయోగం ఏంటంటే
ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తూ యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్. యూజర్ల అవసరాలకు అనుగుణంగా అధునాతన ఫీచర్లను పరిచయం చేస్తున్న వాట్సాప్ తాజాగా కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. 'వాయిస్ మెసేజ్ ట్రాన్స్‌స్క్రిప్ట్' పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్ ఉపయోగం ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Nov 23, 2024 | 1:52 PM

ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తోన్న వాట్సాప్ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. వాయిస్ మెసేజ్ ట్రాన్స్‌స్క్రిప్ట్ పేరుతో ఈ ఫీచర్‌ను తీసుకొచ్చారు. ఇంతకీ ఈ ఫీచర్ ఉపయోగం ఏంటంటే.

సాధారణంగా ఎవరైనా మనకు వాయిస్ మెసేజ్‌లు పంపిస్తే వాటిని ఓపెన్ చేయడంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. నలుగురిలో వాయిస్ మెసేజ్‌లను ఓపెన్ చేయడం ఇబ్బందికరమైన ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇప్పుడు వాట్సాప్ తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్ సహాయంతో వాయిస్ మెసేజ్‌ను చదువుకునే విధంగా మార్చుకోవచ్చు. అంటే వాయిస్ మెసేజ్ చెప్పిన విషయాన్ని టెక్ట్స్ రూపంలో మార్చేస్తోందన్నమాట.

ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవడానికి ముందుగా వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అనంతరం చాట్స్ ఆప్షన్‌లో కనిపించే వాయిస్ మెసేజ్ ట్రాన్స్‌స్క్రిప్ట్ అనే ఫీచర్‌ను కనిపిస్తుంది.





