WhatsApp Voice Chat: వాట్సాప్‌లో కొత్త వాయిస్ చాట్ ఫీచర్.. ఇక టైపింగ్ లేదు.. సులభంగా మాట్లాడండి!
WhatsApp Voice Chat: వాట్సాప్ తన యాప్‌ను సరళంగా, అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి నిరంతరం ప్రయత్నిస్తోంది. ఆఫీసు సహోద్యోగులతో చాట్ చేయడానికి, స్నేహితులతో చాట్ చేయడానికి, అలాగే మీరు చూసిన సినిమాల గురించి మాట్లాడటానికి ఈ కొత్త ఫీచర్ ఉపయోగకరంగా ఉంటుంది..
Updated on: May 27, 2025 | 8:02 PM

WhatsApp Voice Chat: ప్రపంచవ్యాప్తంగా 3.5 బిలియన్లకు పైగా వినియోగదారులతో ఉన్న దిగ్గజం మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్. తన వినియోగదారుల కోసం మరో కొత్త వాయిస్ చాట్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. మీరు ఇప్పుడు వాట్సాప్‌లో గ్రూప్ సంభాషణల్లో నేరుగా మాట్లాడవచ్చు. గతంలో స్నేహితులతో గ్రూప్‌లో కమ్యూనికేట్ చేయడానికి మీరు సందేశాన్ని టైప్ చేయాల్సి వచ్చేది లేదా వాయిస్ నోట్ పంపాల్సి వచ్చేది. ఈ పద్ధతులను నిర్దిష్ట సమయం వరకు మాత్రమే ఉపయోగించవచ్చు. ఎక్కువసేపు మాట్లాడలేరు. ఆ విషయంలో ఈ వాయిస్ చాట్ ఫీచర్ ప్రస్తుతం స్నేహితులతో సుదీర్ఘ సంభాషణలు జరపడానికి వీలుగా రూపొందించింది.

వాట్సాప్‌లో కొత్త వాయిస్ చాట్ ఫీచర్: ఆ విధంగా ఇకపై గ్రూప్‌లో పొడవైన సందేశాలను టైప్ చేయవలసిన అవసరం లేదు. వాట్సాప్ కొత్త గ్రూప్ వాయిస్ చాట్ ఫీచర్ తో మీరు మీ గ్రూప్ తో నేరుగా మాట్లాడవచ్చు. మీరు ఆఫీసులో స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా పని సహోద్యోగులతో వాయిస్ చాట్ చేయవచ్చు. ఉదాహరణకు, మీరు మీ స్నేహితుల బృందానికి పొడవైన సందేశాన్ని టైప్ చేయవలసిన అవసరం లేదు లేదా మీ సహోద్యోగులకు పని సంబంధిత సూచనలు ఇవ్వవలసిన అవసరం లేదు. వాయిస్ చాట్ ఫీచర్‌ని ఉపయోగించి మీ స్నేహితులతో కలిసి వాట్సాప్ గ్రూప్‌లో చేరడం ద్వారా మీరు చెప్పాల్సిన విషయాన్ని ఓపికగా చెప్పవచ్చు.

ఈ ఫీచర్ మొదట్లో పెద్ద వాట్సాప్ గ్రూపులకు మాత్రమే ప్రవేశపెట్టింది. కానీ ఇప్పుడు ఈ సౌకర్యం 2-4 మంది వ్యక్తుల చిన్న గ్రూప్‌ల నుండి 100 కంటే ఎక్కువ మంది సభ్యుల పెద్ద గ్రూప్‌ల వరకు అన్ని రకాల సమూహాలను కవర్ చేయడానికి రూపొందించింది.

ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, iOS వినియోగదారుల కోసం విడుదల చేసింది వాట్సాప్ సంస్థ. ఈ ఫీచర్ మీ ఫోన్‌లో ఇంకా అందుబాటులో లేకపోతే, అది భవిష్యత్తు అప్‌డేట్‌లలో అందుబాటులో ఉంటుంది.





