- Telugu News Photo Gallery Technology photos Truecaller introduces AI based features for answering calls
Truecaller: ట్రూకాలర్‌లో AI ఫీచర్.. మీరు ఫోన్ లిఫ్ట్ చేయలేని పరిస్థితిలో..
కాలర్ ఐటెంటిఫికేషన్ యాప్ ట్రూకాలర్‌కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు ప్రతీ ఒక్క స్మార్ట్ ఫోన్‌లో ఈ యాప్ ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందులో ఉన్న అధునాతన ఫీచర్స్ దీనికి కారణంగా చెప్పొచ్చు. యూజర్ల అవసరాలకు అనుగుణంగా అడ్వాన్స్‌డ్ ఫీచర్లను తీసుకొచ్చే ట్రూకాలర్ యాప్‌లో తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ను పరిచయం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేయడం ఈ కొత్త ఫీచర్ ప్రత్యేకత. ఇంతకీ ఈ ఫీచర్ ఏంటి.? దీనివల్ల ఉపయోగం ఏంటి.? లాంటి వివరాలు మీకోసం..
Updated on: Aug 13, 2023 | 11:43 AM

సాధారణంగా డ్రైవింగ్ చేస్తున్న సమయంలోనో, ఇతర సందర్భాల్లోనే ఎవరైనా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం కుదరదు. అయితే ఇలా ఫోన్ లిఫ్ట్ చేయలేని పరిస్థితుల్లో ఉపయోగపడుతుందీ కొత్త ఫీచర్.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేసే ఈ కొత్త ఫీచర్ మీరు కాల్ లిఫ్ట్ చేయలేని పరిస్థితుల్లో అవతలి వ్యక్తికి సమాధానం చెబుతుంది. ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్‌లో మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు.

అనంతరం ఇతర స్థానిక భాషల్లోనూ అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెబుతున్నారు. ఇక ఈ ఫీచర్‌నె ఎలా ఉపయోగించుకోవాలంటే. ఇందుకోసం యాప్‌లో ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంఉటంది.

యాప్‌లో కనిపించే ట్రూకాలర్ అసిస్టెంట్‌ను ఎనెబుల్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయగానే ఫోన్ కాల్ వచ్చినప్పుడు ట్రూకాలర్ అసిస్టెంట్ ఫోన్ మాట్లాడుతుంది.

ఒకవేళ ఏఐ యాక్టివేట్ అయ్యి అవతలి వ్యక్తితో మాట్లాడుతున్న సమయంలో యూజర్ మధ్యలో ఇంటరాక్ట్ అయ్యి స్వయంగా మాట్లాడొచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.




