శామ్సంగ్ గెలాక్సీ ఏ55.. ఈ స్మార్ట్‌ఫోన్ కచ్చితమైన లాంచ్ తేదీ ఇంకా వెల్లడి కానప్పటికీ.. మార్చి, ఏప్రిల్ మధ్య ఎప్పుడైనా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ హ్యాండ్ సెట్లో 6.5-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 12జీబీ+256జీబీ స్టోరేజ్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్ వంటి ఫీచర్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు.