Realme: మార్కెట్లోకి మరో స్టన్నింగ్‌ ఫోన్‌ వచ్చేస్తోంది.. 200 ఎంపీ కెమెరా, ధర ఎంతో తెలుసా.?

స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం రియల్‌మీ చైనాలో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. రియల్‌ మీ 11 ప్రో, రియల్‌ మీ 11 ప్రో + పేర్లతో రెండు వేరియంట్స్‌లో ఫోన్‌లను తీసుకొచ్చింది. త్వరలోనే భారత మార్కెట్లోకి ఈ ఫోన్‌లను తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్‌ ఫోన్‌లో ఉన్న ఫీచర్లపై ఓ లుక్కేయండి..

|

Updated on: May 27, 2023 | 5:18 PM

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ రియల్‌మీ కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం చైనాలో అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్‌ను త్వరలోనే భారత మార్కెట్లోకి తీసుకురానుంది. రియల్‌మీ 11 ప్రో పేరుతో తీసుకొస్తున్న ఈ 5జీ స్మార్ట్‌ ఫోన్‌లో ఫీచర్లు ఎలా ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

1 / 5
రియల్‌మీ 11 ప్రో, రియల్‌మీ 11 ప్రో + అనే రెండు వేరియంట్స్‌లో ఈ ఫోన్‌ను తీసుకురానున్నారు. ప్రస్తుతం చైనా మార్కెట్లో రియల్ మీ 11 ప్రో ధర సుమారు రూ.20 వేలు (1699 చైనా యువాన్లు), రియల్ మీ 11 ప్రో + ఫోన్ ధర రూ.24 వేల (1999 చైనా యువాన్లు)గా ఉన్నాయి.

2 / 5
ఫీచర్ల విషయానికొస్తే.. రియల్ మీ 11 ప్రో ఫోన్ 8జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 8జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 12 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్లుగా.. రియల్ మీ 11 ప్రో + ఫోన్ 8జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 12 జీబీ రామ్ విత్ 256 ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఆప్షన్లతో రానున్నాయి.

3 / 5
 ఈ రెండు ఫోన్లలోనూ 6.7 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ+ కర్వ్‌డ్‌ డిస్‌ప్లేను అందించారు. 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ కలిగి ఉంటాయి. ఒక్టాకోర్ 6ఎన్ఎం మీడియా టెక్ డైమెన్సిటీ 7050 ఎస్వోసీ చిప్ సెట్‌తో పనిచేస్తాయి.

4 / 5
కెమెరా విషయానికొస్తే.. రియల్ మీ 11 ప్రో ఫోన్‌లో 100 మెగాపిక్సెల్స్‌ రెయిర్‌ కెమెరా, ప్రో +లో 200 మెగాపిక్సెల్స్‌ రెయిర్‌ కెమెరాను ఇస్తున్నారు. కెమెరా సెటప్‌ను కూడా చాలా వైవిద్యంగా డిజైన్‌ చేశారు. రియల్ మీ 11 ప్రో ఫోన్ 67 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ విత్ ది బండిల్డ్ చార్జర్, రియల్ మీ 11 ప్రో + విత్ 100 వాట్ల చార్జింగ్ సపోర్ట్‌ ఇచ్చారు.

5 / 5
Follow us