Poco M6 Plus 5g: పోకో నుంచి కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ ఎలా ఉండనున్నాయంటే

భారత స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని చైనా స్మార్ట్ ఫోన్‌ కంపెనీలు రోజుకో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తున్నాయి. ముఖ్యంగా బడ్జెట్‌ మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకొని కొత్త ఫోన్‌లను తీసుకొస్తున్నారు. 5జీ నెట్‌వర్క్‌ విస్తరిస్తున్న ప్రస్తు తరుణంలో కొత్త 5జీ ఫోన్‌లను తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ కంపెనీ పోకో కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది..

Narender Vaitla

|

Updated on: Jun 03, 2024 | 5:31 PM

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ తయారీ కంపెనీ పోకో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. పోకో ఎమ్‌ సిరీస్‌లో పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. పోకో ఎమ్‌6 ప్లస్‌ పేరుతో తీసుకొచ్చిన 5జీ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
ఈ ఫోన్‌ ఫీచర్లకు సంబంధించి కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే నెట్టింట ఈ ఫోన్‌కు సంబంధించి కొన్ని ఫీచర్లు లీక్‌ అయ్యాయి. ఈ ఫోన్‌ను రెడ్‌మీ నోట్‌ 13 ఆర్‌కి రీబ్రాండెడ్‌ వెర్షన్‌గా తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.

2 / 5
ఇక పోకో ఎమ్‌6 ప్లస్ 5జీ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 6.79 ఇంచెస్‌తో కూడిన ఐపీఎస్‌ డిస్‌ప్లేను అందించనున్నారు. 120Hz రిఫ్రెష్ రేట్‌తో ఈ ఫోన్‌ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌ను 12 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌ను ఇవ్వనున్నారు.

3 / 5
ఇదిలా ఉంటే ఈ ఫోన్‌ క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 4 జెన్‌ 2 చిప్‌సెట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్‌ 14 బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ హైపర్‌ ఓఎస్‌పై పనిచేస్తుంది. ఇక ఇందులో 33 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5030 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇవ్వనున్నారు.

4 / 5
కెమెరా విషయానికొస్తే పోకో ఎమ్‌6 ప్లస్‌ 5జీ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్పీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.

5 / 5
Follow us