Realme C63: రూ. 10 వేలలో కళ్లు చెదిరే ఫీచర్స్‌.. రియల్‌మీ నుంచి కొత్త ఫోన్‌..

బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకొని కంపెనీలు రోజుకో కొత్త ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా చైనాకు చెందిన దిగ్గజ సంస్థలు తక్కువ ధరలో ఫోన్‌లను తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజ సంస్థ రియల్‌మీ కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. రియల్‌మీ సీ63 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Narender Vaitla

|

Updated on: Jun 03, 2024 | 6:17 PM

 చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం రియల్‌మీ కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. రియల్‌మీ సీ63 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. గ్లోబల్‌ మార్కెట్లో లాంచ్‌ అయిన ఈ స్మార్ట్‌ ఫోన్‌ త్వరలోనే భారత మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. ఇంతకీ ఈ బడ్జెట్‌ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

1 / 5
రియల్‌మీ సీ63 స్మార్ట్‌ ఫోన్‌లో 6.74 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ 90 హెచ్‌జెడ్‌ ఎల్‌సీడీ స్క్రీన్‌ను అందించారు. ఎయిర్‌ గెస్చర్‌ అనే ప్రత్యేక ఫీచర్‌ను అందించారు. లాగే ఇందులో ఏఐ నాయిస్‌ రిడక్షన్‌ కాల్‌ ఫీచర్‌ను ప్రత్యేకంగా ఇచ్చారు.

2 / 5
ఇక ఈ ఫోన్‌లో 450 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ను ఇచ్చారు. దీంతో సన్‌లైట్‌లో కూడా ఫోన్‌ స్క్రీన్‌ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఫోన్‌ యూనిసాక్‌ టీ612 అక్టా కోర్‌ 12ఎన్‌ఎమ్‌ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 6 జీబీ ర్యామ్‌ 128 జీబీ, 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌తో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు.

3 / 5
ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ పోన్‌లో యూఐ టీ ఎడిషన్‌ను అందించారు. డ్యూయల్ సిమ్‌తో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్ సెన్సర్‌ను అందించారు. 3.5 ఎమ్‌ఎమ్‌ ఆడియో జాక్‌, బాటమ్‌ పోర్టెడ్‌ స్పీకర్‌ను ఇచ్చారు.

4 / 5
ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. డెప్త్‌ సెన్సర్‌, ఎల్‌ఈడీ ఫ్లాష్‌ ఈ ఫోన్‌ సొంతం. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. 45 వాట్స్‌ సూపర్‌ వూక్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

5 / 5
Follow us