Vivo X Fold 3 Pro: వివో నుంచి స్టన్నింగ్‌ ఫోల్డబుల్ ఫోన్‌.. ధర అక్షరాల రూ. లక్షన్నర

ప్రస్తుతం మార్కెట్లో మడతపెట్టే ఫోన్‌లకు భారీ డిమాండ్ లభిస్తోంది. ఈ నేపథ్యంలో దిగ్గజ సంస్థలన్నీ ఫోల్డబుల్ ఫోన్‌లను తీసుకొస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం వివో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. వివో ఎక్స్‌ ఫోల్డ్‌ 3 ప్రో పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఇంతకీ ఈ ఫోన్ లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Narender Vaitla

|

Updated on: Jun 04, 2024 | 1:10 PM

చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం వివో మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. వివో ఎక్స్‌ ఫోల్డ్‌ 3 ప్రో పేరుతో తీసుకొస్తున్న ఈ ఫోన్‌ను ఇప్పటికే చైనాలో లాంచ్‌ చేయగా, జూన్‌ 6వ తేదీన భారత మార్కెట్లోకి ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు.

1 / 5
ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో ఫ్లాష్‌చిప్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 3 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించనున్నారు. అలాగే ఇందులో 5700 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇవ్వనున్నారు. ఇక గూగుల్‌ జెమిని ఏఐ ఫీచర్స్‌ను ఇందులో ఇవ్వనున్నారు.

2 / 5
ధర విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌ భారత కరెన్సీ ప్రకారం రూ. 1.17 లక్షలుగా ఉండనుంది. ఇక ఇందులో 8.03 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. 2200 x 2480 పిక్సెల్స్‌, 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్ స్క్రీన్ ఈ ఫోన్‌ సొంతం.

3 / 5
ఇక ఈ ఫోన్‌లో 6.53 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ అవుటర్‌ డిస్‌ప్లేను అందించారు. ఈ స్క్రీన్‌ను  1172 x 2748 రిజల్యూషన్‌తో తీసుకొచ్చారు. 16 జీబీ ర్యామ్‌, 1 టీబీ స్టోరేజ్‌తో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నారు.

4 / 5
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్, 64 మెగాపిక్సెల్స్‌తో కూడి రెయిర్‌ కెమెరాలను ఇవ్వనున్నారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించనున్నారు. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 100 వాట్స్‌ ఫ్లాష్‌ ఛార్జింగ్‌, 50 వాట్స్‌ వైర్‌లైస్‌కు సపోర్ట్ చేసే 5700 ఎమ్ఏహెచ్‌ బ్యాటరీని అందించనున్నారు.

5 / 5
Follow us